News October 23, 2024

విశాఖ ఉక్కు పరిశ్రమలో VRSపై సర్వే

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల VRSపై యాజమాన్యం సర్వే చేస్తోంది. VRS కోరుకునే ఉద్యోగి 15 ఏళ్ల సర్వీస్, 45 ఏళ్లలోపు వయసు ఉండాలని నిబంధన విధించింది. అర్హులు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో VRS పేరుతో దగా చేస్తున్నారని, 2500 మందిని ఇంటికి పంపడానికి కుట్రలు చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే పరిహారం గురించి ప్రస్తావన లేకపోవడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 28, 2025

పాకిస్థానీలకు వీసాలు నిలిపేసిన యూఏఈ!

image

పాకిస్థానీలకు వీసాలు జారీ చేయడాన్ని UAE నిలిపేసింది. అక్కడికి వెళ్తున్న చాలా మంది నేర కార్యకలాపాలలో భాగమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సెనేట్ ఫంక్షనల్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ సమావేశంలో పాక్ అధికారి సల్మాన్ చౌధరి చెప్పారు. పాక్ పాస్‌పోర్టులను నిషేధించడం ఒక్కటే తక్కువని అన్నారు. బ్యాన్ చేస్తే పరిస్థితి దిగజారుతుందని తెలిపారు. ఇప్పటికే జారీ చేసిన వీసాలు గడువు ముగిసే దాకా చెల్లుతాయి.

News November 28, 2025

‘దిత్వా’ తుఫాను పయనం ఇలా..

image

AP: నైరుతి బంగాళాఖాతం, ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాను కొనసాగుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ(శ్రీలంక)కి 120KM, పుదుచ్చేరికి 520KM, చెన్నైకి ఆగ్నేయంగా 620KM దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గడిచిన 6 గంటల్లో 13KM వేగంతో కదిలిందని చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వివరించింది.

News November 28, 2025

తిరుపతిలో 600 ఎకరాల్లో ధార్మిక టౌన్‌షిప్

image

AP: తిరుపతిలో డెల్లా గ్రూప్ వసుదైక కుటుంబం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్‌షిప్ నిర్మించబోతోంది. 600 ఎకరాల ప్రైవేటు భూముల్లో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు సహాయసహకారాలు అందించాలని డెల్లా ప్రతినిధులు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ని కోరారు. ఈ టౌన్‌షిప్ రూ.3 వేల కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని, సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని మంత్రి అనగాని వారికి హామీ ఇచ్చారు.