News June 2, 2024

పవన్‌దే గెలుపన్న సర్వేలు.. ముద్రగడపై ట్రోలింగ్

image

AP: పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని సర్వే సంస్థలు అంచనా వేయడంతో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ట్రోలింగ్ జరుగుతోంది. పవన్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ గతంలో ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ జనసైనికులు పోస్టులు పెడుతున్నారు. ‘పెద్దాయన పేరు మరికొన్ని గంటల్లో పద్మనాభ రెడ్డిగా మారబోతుంది’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Similar News

News October 18, 2025

భారత్‌కు ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ!

image

ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ అభ్యర్థన మేరకు అతడిని అరెస్టు చేయడం సరైందేనని అట్వర్ప్‌లోని న్యాయస్థానం పేర్కొంది. అయితే అతడికి హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నా అతడిని ఇండియాకి తీసుకురావడంలో ఇది కీలక అడుగుగా చెప్పొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లు ఎగవేసి ఛోక్సీ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

News October 18, 2025

వేదాల ప్రధాన లక్ష్యం ఇదే..

image

మానవాళిని 3 రకాల కష్టాల నుంచి విముక్తి కలిగించడమే వేదాల ప్రధాన లక్ష్యం. ఈ కష్టాలనే త్రిబాధలని అంటారు. అందులో మొదటిది మన శరీరానికీ, మనసుకీ వచ్చే సమస్యలు. రెండోది ఇతరులు, జంతువుల వల్ల కలిగే బాధలు. చివరిది ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే కష్టాలు. ఈ మూడు బాధలు తొలగి, ప్రతి ఒక్కరూ జీవితంలో నిజమైన శాంతిని, సుఖాన్ని పొందాలని వేదం కోరుకుంటుంది. ఇందుకోసం భగవంతుడిని ప్రార్థించమని ఉద్బోధిస్తుంది. <<-se>>#VedikiVibes<<>>

News October 18, 2025

తెలంగాణ బంద్.. ఇది ఎవరిపై పోరాటం?

image

TG: రాష్ట్ర బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. 42% శాతం రిజర్వేషన్ల కోసం BC సంఘాలు బంద్ చేపట్టాయి. దానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్, కేంద్ర అధికార పార్టీ BJP కూడా మద్దతు తెలిపాయి. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే మరి బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికా? రాష్ట్ర ప్రభుత్వానికా? అసలు పోరాటం ఎవరిపై?