News April 7, 2024
సూర్య డకౌట్.. నెటిజన్ కామెంట్ వైరల్

ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అవడంపై ఓ కామెంట్ నెట్టింట వైరలవుతోంది. రెండ్రోజుల క్రితం ముంబై జట్టులో చేరిన సూర్య బ్యాక్ హోమ్ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఓ నెటిజన్ ‘ఢిల్లీతో మ్యాచ్‌లో సున్నా కంటే ఎక్కువ పరుగులు చేస్తే నువ్వు గే’ అంటూ కామెంట్ పెట్టారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచ్‌లో సూర్య డకౌట్ కావడంతో ‘మిస్టర్ 360 గే కాదని నిరూపించారు’ అంటూ ఆ కామెంట్‌ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
Similar News
News February 3, 2026
క్రేజీ కాంబో.. ధురంధర్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ మూవీ?

‘ఉరి’, ‘ధురంధర్’ ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటించబోతున్నట్లు టాక్. ఆదిత్య తన కలల ప్రాజెక్ట్‌ను బన్నీకి వినిపించగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ధురంధర్-2 మార్చిలో రిలీజైన తర్వాత ఈ భారీ పాన్ ఇండియా మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అట్లీ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ ఓ మూవీ చేస్తుండగా.. లోకేశ్, త్రివిక్రమ్‌తోనూ సినిమాలు కమిట్ అయినట్లు సమాచారం.
News February 3, 2026
వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌తో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది

మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సాధారణమే అయినా దాని రంగు మారినా, వజైనా పొడిబారి మంట, దురద వస్తూ స్పాటింగ్ కనిపిస్తున్నా వజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే. అయితే కొన్నిరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావొచ్చు. దీన్ని త్వరగా గుర్తించకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ పగిలి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News February 3, 2026
పాలు లేకుండా ఎవరైనా నెయ్యి చేయగలుగుతారా: పయ్యావుల

AP: నెయ్యి తయారీకి పాలు అవసరం లేదన్నట్లు రూలు మార్చారంటే దాని వెనుక దురుద్దేశం ఉన్నట్టా? లేనట్టా? అని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ‘నిబంధనలు మార్చాకనే బోలేబాబా వంటి సంస్థలు వచ్చాయి. ఛైర్మన్ సుబ్బారెడ్డి PA అప్పన్న లీటర్‌కు రూ.25 ఇవ్వాలని అడిగితే అది తిరస్కరించింది. దీంతో బ్లాక్ లిస్టులో పెట్టించగా వైష్ణవీ డెయిరీతో కలిసి దొడ్డిదారిన మళ్లీ వచ్చింది. ఇవన్నీ విచారణలో తేలాయి’ అని పేర్కొన్నారు.


