News September 3, 2024

సూర్య దేవుడొచ్చేశాడు!

image

నాలుగైదు రోజులుగా సూర్యరశ్మి తగలక వణికిపోతున్న శరీరానికి ఊరటనిచ్చేందుకు కారు మబ్బులను చీల్చుకుంటూ భానుడు బయటకొచ్చాడు. హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షం కురిసినప్పటికీ ఒక్కసారిగా వాతావరణం పొడిగా మారిపోయింది. ప్రస్తుతం సూర్యుడు వచ్చేసరికి నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీవద్ద సూర్యుడు వచ్చాడో? లేదో? కామెంట్ చేయండి.

Similar News

News December 25, 2025

తెలుసా..?: 3 సార్లు ఫెయిలైతే సర్పంచ్ తొలగింపు

image

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో సర్పంచ్‌లకు అధికారాలతో పాటు విధుల గురించి ప్రస్తావించారు. కేటాయించిన నిధులు సరిగా ఖర్చు చేయకుంటే పాలకవర్గం మొత్తాన్ని రద్దు చేయొచ్చు. ఇక 2 నెలలకు ఓ సారి జరగాల్సిన గ్రామసభలు వరుసగా 3 సార్లు నిర్వహించకపోయినా సర్పంచ్‌ను తొలగించవచ్చు. ప్రజలకు అవగాహన, చైతన్యం పెరిగిన నేపథ్యంలో పాలకులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా పదవులు ఊడే అవకాశముంది జాగ్రత్త.

News December 25, 2025

వైద్య రంగంలో PPPతోనే మేలు: నడ్డా లేఖ

image

AP: వైద్యరంగంలో PPP విధానంతో మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి నడ్డా పేర్కొన్నారు. ‘పైలెట్ ప్రాజెక్టు వ్యయంలో 80%, 5 ఏళ్లపాటు నిర్వహణ వ్యయంలో 50% వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద అందుతుంది. మొత్తంగా 40%వరకు కేంద్ర సాయం ఉంటుంది. మౌలిక వసతులు భారీగా సమకూరుతాయి. సేవల నాణ్యత, పారదర్శకత పెరుగుతుంది’ అని మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. PPP సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

News December 25, 2025

ఇకపై ‘కామెలియా సినెన్సిస్’ ఆకులతో చేసేదే టీ!

image

కేవలం ‘కామెలియా సినెన్సిస్’ (టీ మొక్క శాస్త్రీయ నామం) ఆకులతో చేసే డ్రింక్‌ను మాత్రమే ‘Tea’ అనాలని FSSAI స్పష్టం చేసింది. హెర్బల్ టీ, ఫ్లవర్ టీ లేదా రూయిబోస్ టీ వంటి డ్రింక్స్‌కు ‘టీ’ అనే ట్యాగ్ వాడటం తప్పుదోవ పట్టించడమే అవుతుందని తెలిపింది. ఇకపై ఇలాంటి డ్రింక్స్‌ను ‘Tea’గా కాకుండా ఇతర పేర్లతో విక్రయించాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.