News November 28, 2024
కొత్త సినిమా మొదలుపెట్టిన సూర్య

హీరో సూర్య కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సూర్య45’ పూజా కార్యక్రమం నిన్న జరిగింది. ఈ సినిమాకు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించనున్నారు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రానున్న ‘సూర్య 44’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘కంగువా’ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
Similar News
News December 8, 2025
విమానాల రద్దు.. ఇండిగో షేర్లు భారీగా పతనం

ఇండిగో(ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) షేర్లు ఇవాళ ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. సెషన్ ప్రారంభంలో ఏకంగా 7 శాతం నష్టపోయాయి. తర్వాత కాస్త ఎగసినా మళ్లీ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం 406 పాయింట్లు కోల్పోయి(7.6 శాతం) 4,964 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత 5 రోజుల్లో ఏకంగా 14 శాతం మేర నష్టపోయాయి. వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు.
News December 8, 2025
వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 8, 2025
మావోయిస్టు కీలక నేత లొంగుబాటు.. MMCలో ఉద్యమం అంతం!

మావోయిస్టు పార్టీ కీలక నేత రామ్‌ధేర్ మజ్జీ సహా 12 మంది ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రామ్‌ధేర్ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతడిపై రూ.3 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. రామ్‌ధేర్ లొంగుబాటుతో MMC జోన్లో మావోయిజం అంతమైనట్లేనని భావిస్తున్నారు.


