News July 27, 2024
సూర్య తాత్కాలిక కెప్టెన్ మాత్రమే: స్టైరిస్

భారత్కు సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక కెప్టెన్ మాత్రమేనని న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ స్టైరిస్ అభిప్రాయపడ్డారు. శుభ్మన్ గిల్ను భవిష్యత్ కెప్టెన్గా భారత్ చూస్తోందని అంచనా వేశారు. ‘గిల్ మరింత పరిపక్వత సాధించేవరకు అతడిని వైస్ కెప్టెన్గా కొనసాగించాలని టీమ్ ఇండియా భావిస్తున్నట్లు అనిపిస్తోంది. సూర్యది కూడా పెద్ద వయసే. గిల్ కెప్టెన్గా వచ్చేవరకు అతడు సారథిగా ఉంటారు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 28, 2025
‘ముక్కోటి ఏకాదశి’ ఎందుకు స్పెషల్?

ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అందులో ముక్కోటి ఏకాదశి విశిష్టమైనది. ఈరోజే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠం చేరుకుంటారు. అందుకే దీనిని ‘ముక్కోటి ఏకాదశి’ అంటారు. ఈ ఒక్క ఏకాదశి నాడు చేసే ఉపవాసం మిగిలిన 23 ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు. అందుకే సామాన్య భక్తుల నుంచి మునుల వరకు అందరూ ఈ రోజును మోక్షాన్ని ప్రసాదించే గొప్ప పర్వదినంగా భావిస్తారు.
News December 28, 2025
తిరుమలలో స్థలం ఇవ్వాలని పవన్, అనగానిల అభ్యర్థన.. తిరస్కరించిన TTD

AP: తిరుమలలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించాలన్న డిప్యూటీ సీఎం పవన్, మంత్రి అనగాని సత్యప్రసాద్ల అభ్యర్థనను టీటీడీ తిరస్కరించింది. ఈ నెల 16న పాలకమండలి తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా బయటకు వచ్చింది. కొండపై పరిమితంగా భూములు ఉండటం, కొత్త నిర్మాణాలపై హైకోర్టు ఆంక్షలు విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న భవనాలు కేటాయిస్తామని సదరు మంత్రులకు సమాచారం ఇచ్చింది.
News December 28, 2025
TET: 500 కి.మీ. దూరంలో సెంటర్లు

TG: టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కొందరు అభ్యర్థులకు ఖమ్మంలో సెంటర్లు కేటాయించారు. దాదాపు 500KMకు పైగా దూరం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని పరీక్ష రాసే ఇన్ సర్వీస్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆలస్యంగా అప్లై చేసుకున్న వారికే దూరంగా సెంటర్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.


