News February 4, 2025
సూర్య కుమార్ చెత్త రికార్డు

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 5.60 యావరేజ్‌తో కేవలం 28 రన్స్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అతని కెరీర్‌లో ఒక సిరీస్‌లో ఇదే లోయెస్ట్ యావరేజ్. 2022లో ఐర్లాండ్‌పై 7.50 AVGతో 15 రన్స్, 2024లో సౌతాఫ్రికాపై 8.66 యావరేజ్‌తో 26 పరుగులు చేశారు. సూర్య బ్యాటర్‌గా విఫలమవుతున్నా కెప్టెన్‌గా సక్సెస్ అవుతున్నారు. అతని సారథ్యంలో 23 మ్యాచ్‌లు ఆడగా భారత్ 18 గెలిచింది.
Similar News
News December 2, 2025
‘మంత్రులు తుమ్మల, భట్టి, పొంగులేటి చొరవ తీసుకోవాలి’

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి భద్రాద్రి జిల్లా పర్యటన నేపథ్యంలో ఖమ్మం యూనివర్సిటీ కల సాకారమవుతుందని స్థానికులు, విద్యార్థులు ఆశిస్తున్నారు. 45 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను పరిష్కరించి, అన్ని వనరులు ఉన్న ఎస్ఆర్ & బీజీఎన్ఆర్ కళాశాలను యూనివర్సిటీగా ప్రకటిస్తారని ఆశపడుతున్నారు. ఈ విషయంలో మంత్రులు తుమ్మల, భట్టి, పొంగులేటి చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News December 2, 2025
లేజర్ వెపన్ ‘ఐరన్ బీమ్’ సిద్ధం చేసిన ఇజ్రాయెల్!

అత్యాధునిక, హైపవర్ లేజర్ రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ‘ఐరన్ బీమ్’ను డిసెంబర్ 30న దళాలకు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. విమానాలు, క్షిపణులు, రాకెట్లు, UAVs, డ్రోన్లను భూమిపై నుంచే ఛేదించేలా రూపొందించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. 2014లోనే ఐరన్ బీమ్‌ను ఇజ్రాయెల్ ఆవిష్కరించింది. కానీ 11 ఏళ్లుగా అభివృద్ధి దశలోనే ఉంది. ఆ ప్రక్రియను పూర్తి చేసి సైన్యానికి అందించనుంది.
News December 2, 2025
ఇవి వాడితే పంటకు రక్షణ, దిగుబడికి భరోసా

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్రపురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


