News June 30, 2024

సూర్య 50క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు: దిలీప్

image

T20WCలో బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకోవడంపై ఫీల్డింగ్ కోచ్ దిలీప్ స్పందించారు. సూర్య ప్రాక్టీస్‌లో అలాంటివి 50 క్యాచ్‌లు అందుకున్నారని తెలిపారు. బౌండరీ లైన్‌పై కచ్చితమైన అవగాహన ఉంటేనే బంతిని ఎప్పుడు పైకి విసరాలి, మళ్లీ ఎప్పుడు అందుకోవాలనేది తెలుస్తుందన్నారు. కుల్దీప్ కూడా డికాక్ కొట్టిన బంతిని అద్భుతంగా అందుకున్నారని చెప్పారు.

Similar News

News September 20, 2024

పెళ్లి పేరుతో 50 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు!

image

పెళ్లి పేరుతో ఓ జడ్జి సహా 50మందికి పైగా మహిళల్ని మోసం చేసిన UP వ్యక్తి ముకీమ్‌ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ క్రియేట్ చేసి ఫేక్ IDలతో తాను ప్రభుత్వ ఉద్యోగినని, భార్య చనిపోయిందని చెప్పేవాడు. పెళ్లి ఫిక్సయ్యాక మ్యారేజ్ హాల్స్ బుకింగ్, ఇతర కారణాలు చెప్పి డబ్బు తీసుకుని పరారయ్యేవాడు. పెళ్లి కాని, వితంతు ముస్లిం మహిళల్నే తాను టార్గెట్ చేసినట్లు విచారణలో తెలిపాడు.

News September 20, 2024

రెండో రోజు ఆట మొదలు

image

చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. నిన్న 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసిన టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది. క్రీజులో సెంచరీ హీరో రవిచంద్రన్ అశ్విన్(102), జడేజా(86) ఉన్నారు. భారత్ ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

News September 20, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో వారికి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. వారికి నోటీసులు ఇవ్వాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేఖ రాసింది. వారిద్దరినీ ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభాకర్ USలో చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించామని, శ్రవణ్ ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపారు. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని భావిస్తున్నారు.