News May 7, 2024
గాయంపై సూర్యకుమార్ యాదవ్ స్పష్టత
SRHతో మ్యాచ్‌లో సూర్యకుమార్ అద్భుత సెంచరీతో ముంబైను గెలిపించారు. బ్యాటింగ్ సమయంలో ఆయన గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు. దీంతో టీ20 వరల్డ్ కప్ ముంగిట సూర్య గాయాలపాలయ్యారా అన్న ఆందోళన టీమ్ ఇండియా అభిమానుల్లో వ్యక్తమైంది. అయితే, అది అలసట మాత్రమేనని సూర్య మ్యాచ్ అనంతరం తెలిపారు. చాలా రోజుల తర్వాత 38 ఓవర్ల పాటు గ్రౌండ్‌లో ఉండటంతోనే స్వల్ప అసౌకర్యంగా అనిపించిందని స్పష్టం చేశారు.
Similar News
News January 6, 2025
EXCLUSIVE: భారత్‌లో చైనా వైరస్ తొలి కేసు!
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV భారత్‌నూ చేరినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా పేరంట్స్ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్ టెస్టులో బేబీకి హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (HMPV) పాజిటివ్‌గా తేలింది. దీనిపై సమాచారం అందినట్లు పేర్కొన్న కర్ణాటక ప్రభుత్వం తమ ల్యాబులో నిర్ధారించాల్సి ఉందని తెలిపింది. ఆ చిన్నారి విదేశాలకు ప్రయాణించకపోవడం గమనార్హం.
News January 6, 2025
ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్లు?
ప్రశాంత్ నీల్-Jr.NTR సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో మలయాళ స్టార్లు టొవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో NTR కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
News January 6, 2025
కోహ్లీ వద్ద ఇంకా చాలా రన్స్ ఉన్నాయి: పాంటింగ్
సిడ్నీ టెస్టు 2వ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అవగానే అసహనానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ఒకే తరహాలో పదే పదే పెవిలియన్‌కు చేరుతుండటంపై కోహ్లీ తనపై తానే కోపం చూపించుకున్నాడని చెప్పారు. విరాట్‌కు ఈ సిరీస్ కచ్చితంగా నిరాశ కలిగించిందన్నారు. కానీ అతని వద్ద ఇంకా చాలా పరుగులు ఉన్నాయని ఆయన చెప్పారు. BGTలో కోహ్లీ 190పరుగులే చేశారు.