News March 17, 2024

సూర్యాపేట: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

image

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండపురిలో ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన పాలకుర్తి వెంకన్న రోజు మాదిరి కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News February 6, 2026

NLG: ఓట్ల లెక్కింపునకు ర్యాండమైజేషన్

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ జి. రమేష్ సమక్షంలో కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించారు. 270 మంది కౌంటింగ్ స్టాఫ్, 540 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, మొత్తం 810 మంది సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్‌ను నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.

News February 6, 2026

మునుగోడు: విద్యాశాఖ అధికారులకు పట్టని గోడు

image

మునుగోడు మండలం పలివెల జడ్పీ హైస్కూల్‌లో విద్యాశాఖ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గత మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయుడు లేకపోవడంతో బోధన పూర్తిగా నిలిచిపోయింది. పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న వేళ, పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, వెంటనే టీచర్‌ను నియమించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

News February 6, 2026

NLG: చేపా.. చేపా.. ఎక్కడికెళ్లావ్‌ ?

image

NLG జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో ఏటా సుమారు 5 కోట్లకు పైగానే చేపపిల్లలు వదులుతున్నారు. పుష్కలంగా మత్స్య సంపద దొరుకుతుందని అందరూ అనుకుంటున్నా జిల్లాలో నేడు కొందామంటే చేపలు దొరకని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున చేపపిల్లలు ఉచితంగానే పంపిణీ చేస్తున్నా.. అందులో ఎక్కువ శాతం నాసిరకం పిల్లలను పంపిణీ చేస్తున్నారని మత్య్సకారులు తెలిపారు.