News October 25, 2024

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియాకు ఊరట

image

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మృతి కేసులో న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె కుటుంబ స‌భ్యుల‌పై సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల‌ను హైకోర్టు కోట్టివేయ‌డాన్ని సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. నిందితుల హైప్రోఫైల్ నేప‌థ్యం కార‌ణంగా హైకోర్టు తీర్పును సీబీఐ, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం స‌వాల్ చేయ‌డాన్ని సుప్రీంకోర్టు త‌ప్పుబ‌ట్టింది. లుక్ అవుట్ నోటీసులు జారీ చేయ‌డానికి త‌గిన కార‌ణాలు లేవని హైకోర్టు గ‌తంలో తేల్చింది.

Similar News

News November 3, 2025

స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా తమ అభిప్రాయం తెలిపేందుకు గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.

News November 3, 2025

ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తున్నామనడం సరికాదు: ఒవైసీ

image

బిహార్ ఎన్నికల్లో ‘ఇండీ’ కూటమి ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తున్నామన్న విమర్శలను MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ‘2020లో 5 సీట్లు గెలిచాం. పోటీచేసిన మిగతా 14లో 9 MGB గెలిచింది. 2024లో కిషన్‌గంజ్ MP సీటులో 2 లక్షలకుపైగా ఓట్లు సాధించాం. మేం ఆ ఒక్క సీట్లో పోటీచేసినా BJP అనేక చోట్ల గెలిచింది’ అని తెలిపారు. గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేయడానికే తమ పోటీ అన్నారు. ఈసారి MIM 24చోట్ల పోటీ చేస్తుంది.

News November 3, 2025

మైక్రో చీటింగ్‌తో కాపురాల్లో చిచ్చు

image

భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం, మోసం చేయకుండా.. చిన్నచిన్న తప్పులు చేస్తుండటమే.. ‘మైక్రో చీటింగ్‌’. ఇది అక్రమ సంబంధం అంత స్పష్టంగా ఉండదు. ఇందులో చాలామందికి చెడు ఉద్దేశాలూ ఉండవని అంటున్నారు నిపుణులు. కానీ చిన్నచిన్న తప్పులతోనే దంపతుల మధ్య నమ్మకం, భావోద్వేగ భద్రత దెబ్బతిని దీర్ఘకాలంలో విడాకులకూ దారితీస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ఇద్దరూ కలిసి చర్చించుకుంటే.. సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.