News May 13, 2024

సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత

image

బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(72) కన్నుమూశారు. కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ట్వీట్ చేశారు. సుశీల్ కుమార్ మోదీ తన 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజ్యసభ, లోక్‌సభ, శాసన మండలి, శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.

Similar News

News February 8, 2026

ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: CM

image

TG: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ తర్వాత ఇస్తామని CM రేవంత్ చెల్పూర్‌ సభలో ప్రకటించారు. గోదావరి సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేసే యోచన లేదన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం చేకూర్చే ఏ పనిని ప్రభుత్వం చేపట్టదని స్పష్టం చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాలను, దేవాలయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.3వేలకోట్లయినా ఖర్చు చేస్తామన్నారు.

News February 8, 2026

ఇంగ్లండ్‌పై పోరాడి ఓడిన నేపాల్

image

T20WC: ఇంగ్లండ్-నేపాల్ మధ్య పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నేపాల్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీపేంద్ర సింగ్(44), కెప్టెన్ రోహిత్ పౌడెల్(39) పోరాటం వృథా అయ్యింది. కుశాల్(29), లోకేశ్(39) కూడా అద్భుతంగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 2, ఆర్చర్, విల్ జాక్స్, సామ్ కరన్, ఉడ్ తలో వికెట్ తీశారు.

News February 8, 2026

ఆలయాలకు గోపురం ఎందుకు ఉంటుంది?

image

గోపురం ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక అవసరాల సమాహారం. ఆగమ శాస్త్రం ప్రకారం ఇది దేవుని పాదాలకు సంకేతం. గుడిపై ఈ నిర్మాణం విశ్వశక్తిని గ్రహిస్తుంది. గుడికి శక్తి కేంద్రంగా నిలుస్తుంది. దేవుడే సర్వోన్నతుడని చాటుతుంది. ఎత్తుగా ఉండి బాటసారులకు దిక్సూచిగా మార్గం చూపుతుంది. పిడుగుల నుంచి రక్షణ కవచంగా పనిచేస్తుంది. దూరం నుంచి గోపురాన్ని దర్శించినా దైవకృప లభిస్తుందని నమ్మకం. మన సంస్కృతికిది నిలువుటద్దం.