News July 18, 2024

T20 కెప్టెన్సీపై కొనసాగుతున్న సస్పెన్స్!

image

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొత్త కెప్టెన్, శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపికపై కోచ్ గంభీర్ బీసీసీఐ సెక్రటరీ జైషాతో చర్చించారు. ముఖ్యంగా టీ20 జట్టుకు సారథిగా సూర్యకుమార్‌ను నియమించాలని కోచ్ గంభీర్ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్దిక్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని షా భావిస్తున్నారట. అందుకే కెప్టెన్సీపై ఇప్పటికీ స్పష్టత రావడం లేదని జాతీయ మీడియా పేర్కొంది.

Similar News

News January 22, 2025

32,438 ఉద్యోగాలు.. పోస్టుల వారీగా

image

రైల్వేలో 32438 లెవల్-1 (గ్రూప్-డి) పోస్టులకు నిన్న నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అత్యధికంగా 13187 ట్రాక్ మెయింటెనర్, 5058 పాయింట్స్‌మన్-B, 3077 అసిస్టెంట్ (వర్క్ షాప్), 2587 అసిస్టెంట్ (C&W), 2012 అసిస్టెంట్ (S&T), 1381 అసిస్టెంట్ TRD ఉద్యోగాలు ఉన్నాయి. టెన్త్ పాస్ లేదా ఐటీఐ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News January 22, 2025

చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్

image

టీమ్ ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించారు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ అవతరించారు. ఇప్పటివరకు ఆయన 97 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆయన ఈ ఫీట్ సాధించారు. ఈ క్రమంలో యుజ్వేంద్ర చాహల్ (96) రికార్డును అర్ష్‌దీప్ అధిగమించారు.

News January 22, 2025

డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం: TGSRTC

image

ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని TGSRTC ఖండించింది. ఎలక్ట్రిక్ బస్సుల మెయిన్‌టనెన్స్, ఛార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా TGSRTC ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొస్తున్నామని, ఈ ఏడాది మేలో మరిన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.