News March 16, 2024
పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్
AP: దివంగత YS వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్ నెలకొంది. నిన్న వివేకా వర్ధంతి కార్యక్రమంలో దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా కొద్దిరోజుల నుంచి సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ YCPపై విమర్శల డోస్ పెంచారు. ఈ నేపథ్యంలో వీరి పొలిటికల్ ఎంట్రీ ఉండొచ్చని, త్వరలోనే స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అన్ని వర్గాల మద్దతు దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 22, 2024
విమర్శలపై స్పందించిన కొండా సురేఖ
TG: ఎన్ని విమర్శలు, ఆరోపణలొచ్చినా ప్రజలపై తన ప్రేమను, సేవాభావాన్ని తగ్గించలేవని మంత్రి కొండా సురేఖ అన్నారు. కొన్ని దుష్టదుర్మార్గ శక్తులు ఎన్ని అడ్డంకులను సృష్టించినా అనుక్షణం జనమే మనమంటూ ముందుకు కదులుతానని ట్వీట్ చేశారు. ఆమె <<14675277>>వీడియో<<>> ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతున్న నేపథ్యంలోనే మంత్రి ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
News November 22, 2024
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. నేడే లాస్ట్
TG: టెట్ అభ్యర్థులకు దరఖాస్తులు ఎడిట్ చేసుకునే అవకాశం నేటితో ముగియనుంది. బుధవారమే దరఖాస్తు ప్రక్రియ ముగియగా తప్పులను సరిచేసుకోవడానికి ఈ నెల 22 వరకు ఎడిట్ ఆప్షన్ కల్పించారు. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు డౌన్ కావడంతో తాము అప్లై చేసుకోలేకపోయామని, దరఖాస్తు గడువు పెంచాలని కొందరు కోరుతున్నారు.
News November 22, 2024
దెబ్బకు దిగొచ్చిన కెనడా: హత్యలతో మోదీకి సంబంధం లేదంటూ వివరణ
హర్దీప్నిజ్జర్ హత్య, ఇతర నేరాలతో PM మోదీకి సంబంధం లేదని కెనడా స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను ధ్రువీకరించే ఆధారాలేమీ లేవని వెల్లడించింది. గ్లోబ్, మెయిల్ న్యూస్పేపర్లలో కథనాలు వదంతులేనని తెలిపింది. అమిత్ షా, జైశంకర్, అజిత్ దోవల్, మోదీకి నిజ్జర్ హత్యకు సంబంధం ఉన్నట్టు ఈ పత్రికలు చిత్రీకరించాయి. దీంతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న దౌత్యసంబంధాలు ఇంకా దెబ్బతింటాయని భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.