News March 23, 2024
ఉత్కంఠ పోరులో SRH ఓటమి

సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20ఓవర్లలో 208 రన్స్ చేయగా.. చేధనకు దిగిన హైదరాబాద్ చివరి వరకు పోరాడి 204 రన్స్ చేసింది. క్లాసెన్ (25 బంతుల్లో 61) అద్భుత పోరాటం వృథా అయింది. చివరి ఓవర్లో క్లాసెన్, షాబాజ్ ఔట్ కావడంతో KKR 4 రన్స్ తేడాతో గెలిచింది. రస్సెల్ బ్యాటింగ్‌లో 64 రన్స్, బౌలింగ్‌లో 2వికెట్లతో రాణించారు.
Similar News
News April 20, 2025
విమానాన్ని ఢీకొట్టిన టెంపో వ్యాన్!

బెంగళూరు ఎయిర్‌పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
News April 20, 2025
వర్షం మొదలైంది..

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్‌పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News April 20, 2025
మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరుగుతున్నాయి. అధిక వేడి కారణంగా కొందరు వడదెబ్బకు గురై అవస్థలు పడుతున్నారు. వడదెబ్బ తగిలిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకంటే ఎక్కువగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. వాంతులు, వికారంతోపాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరంలో మార్పులు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.