News August 2, 2024
ఉత్కంఠ.. భారత్ గెలుస్తుందా?
భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ దూకుడుగా ప్రారంభించిన టీమ్ ఇండియా వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. టీమ్ ఇండియా గెలవాలంటే 42 బంతుల్లో 26 రన్స్ కావాలి. మరో 3 వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ స్కోర్ 42 ఓవర్లలో 205/7. మరి ఈ మ్యాచులో భారత్ గెలుస్తుందా? కామెంట్ చేయండి.
Similar News
News February 3, 2025
సౌతాఫ్రికాకు నిధుల్ని నిలిపేసిన ట్రంప్
దక్షిణాఫ్రికాకు తమ దేశం ఇచ్చే నిధులన్నింటినీ ఆపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘కొన్ని వర్గాల ప్రజలపై సౌతాఫ్రికా చాలా ఘోరంగా వివక్ష చూపిస్తోంది. వారి భూముల్ని లాక్కుంటోంది. అక్కడి వామపక్ష మీడియా దీన్ని బయటికి రాకుండా అడ్డుకుంటోంది. ఇలాంటివాటిని చూస్తూ ఊరుకోం. అక్కడేం జరుగుతోందో పూర్తి నివేదిక వచ్చే వరకూ ఆ దేశానికి మా నిధుల్ని పూర్తిగా ఆపేస్తున్నా’ అని పేర్కొన్నారు.
News February 3, 2025
సినిమాల్లోకి మోనాలిసా.. కొత్త PHOTO
కుంభమేళాలో ఆకర్షించే కళ్లతో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిన మోనాలిసా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పుష్ప-2 మూవీ పోస్టర్ ముందు ఆమె దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇప్పుడు పోస్టర్ బయట. రేపు పోస్టర్ లోపల. కాలచక్రం అంటే ఇదే. త్వరలోనే ముంబైలో కలుద్దాం’ అంటూ ఆమె Xలో చెప్పుకొచ్చింది. కాగా <<15310417>>‘ది డైరీ ఆఫ్ మణిపుర్’<<>> చిత్రంలో మోనాలిసా నటించనుంది.
News February 3, 2025
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
గత వారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 620 పాయింట్ల నష్టంతో 76,895 వద్ద, నిఫ్టీ 211 పాయింట్లు నష్టపోయి 23,260 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.16గా ఉంది.