News August 19, 2024

ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ సస్పెన్షన్

image

AP: ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫైబర్‌నెట్‌లో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సంస్థలో పెద్దఎత్తున తన బంధువులను నియమించి రూ.వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, మెటీరియల్ కొనుగోలు, నియామకాల్లోనూ గోల్‌మాల్ చేశారని పలువురు ఆయనపై ఫిర్యాదు చేశారు.

Similar News

News January 24, 2026

ఆరోపణలు అవాస్తవం.. ఇదే శివ నిజ స్వరూపం: పోలీసులు

image

కొత్తకోటలో పోలీసుల మీద ఆరోపణలు చేసిన శివ మీద గతంలో అనేక కేసులు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. 2హత్యాహత్నం కేసులు, ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అక్రమ సారా రవాణా కేసు నమోదు అయింది. దర్యాప్తుకు పోలీసులు పిలిచినప్పుడు ఆరోపణల గందరగోళాన్ని శివ అలవాటు సృష్టించే అలవాటు పరిపాటిగా మారింది. 2019 సంవత్సరంలో అప్పటి ఎస్సై దామోదర్ నాయుడుపై ఇలాంటి ఆరోపణలే చేశాడు.

News January 24, 2026

ప్రైస్‌తో పనిలేదు.. కొంటూనే ఉంటా: బంగారం, వెండిపై రాబర్ట్ కియోసాకి

image

బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు పెరిగినా, తగ్గినా తనకు అనవసరమని ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి చెప్పారు. ప్రభుత్వాలు అప్పులు పెంచుకుంటూ పోవడం వల్ల కరెన్సీ విలువ పడిపోతోందని, పేపర్ మనీ కంటే ఈ ‘రియల్ అసెట్స్’ వైపే మొగ్గు చూపుతానని వివరించారు. పాలసీ మేకర్ల నిర్ణయాల వల్ల మార్కెట్‌లో అనిశ్చితి ఉంటే షార్ట్ టర్మ్ ధరల గురించి టెన్షన్ పడకుండా సంపదను పోగు చేసుకోవడమే తెలివైన పని అని వివరించారు.

News January 24, 2026

ఉపవాసంతో వృద్ధాప్యం దూరం

image

ఉపవాసం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. ఉపవాసం శరీరంలోని కణాలను రిపేర్ చేయడంతో పాటు, నిద్ర, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే BP, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుందంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యఛాయలను దూరం చెయ్యడంలో ఉపవాసం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు సిర్టుయిన్స్ ఉత్పత్తై వృద్ధాప్య ప్రక్రియకు వ్యతిరేకంగా పనిచేస్తాయంటున్నారు.