News July 16, 2024
ఏపీలో భూముల రీ సర్వే నిలిపివేత

గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే అమలును నిలిపివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. సర్వే పేరుతో గత పాలకులు భూముల సరిహద్దులను మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాల నివారణకు ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్’ను త్వరలోనే తీసుకొస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో YCP నేతలు లాక్కున్న భూముల్ని తిరిగి బాధితులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 24, 2025
‘VB-G RAM G’పై ప్రభుత్వ అడుగు ఎటు?

TG: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం ‘VB-G RAM G’గా మార్చింది. దీనిని INC అధినేత్రి సోనియా, విపక్ష నేతలు వ్యతిరేకించారు. WB CM మమత తమ రాష్ట్ర ఉపాధి పథకానికి గాంధీ పేరు పెడతామని ప్రకటించారు. కర్ణాటక, కేరళ GOVTలు నిరసనకు దిగాయి. కేంద్ర చర్యను వ్యతిరేకించాలని రాష్ట్రంలోనూ డిమాండ్లున్నాయి. త్వరలో అసెంబ్లీ సమావేశాలున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ సాగుతోంది.
News December 24, 2025
రాస్కోండి.. 29లో 2/3 మెజార్టీ పక్కా: రేవంత్

TG: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2/3 మెజార్టీతో గెలుస్తుందని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ‘2029లో 119 సీట్లే ఉంటే 80కి పైగా సాధిస్తాం. ఒకవేళ 150 (నియోజకవర్గాల పునర్విభజన) అయితే 100కు పైగా గెలుస్తాం’ అని కోస్గిలో ప్రకటించారు. ‘చంద్రశేఖర్ రావు, హరీశ్ రావు, దయాకర్ రావు సహా BRS రావులంతా ఇది రాసి పెట్టుకోండి’ అని ఛాలెంజ్ విసిరారు. తాను ఉన్నంత వరకూ BRSను అధికారంలోకి రానివ్వనని స్పష్టం చేశారు.
News December 24, 2025
EV ఛార్జింగ్ స్లో అయిందా? కారణాలివే

EVలలో వినియోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు టెంపరేచర్ సెన్సిటివ్‌గా ఉంటాయి. వింటర్లో ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కరెంట్ ఫ్లోకు ఎక్కువ టైమ్ పడుతుంది. అధునాతన EVల్లో వాతావరణంలో మార్పులను తట్టుకునేలా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేశారు. బ్యాటరీ హెల్త్ కాపాడేందుకు ఛార్జింగ్ స్పీడ్, కెమికల్ రియాక్షన్స్‌ను తగ్గిస్తుంది. కొన్ని EVల్లో ఫాస్ట్ ఛార్జింగ్‌కు ముందు బ్యాటరీని ప్రీకండిషనింగ్ చేయొచ్చు.


