News October 30, 2024
‘కంగువా’ ఎడిటర్ అనుమానాస్పద మృతి
త్వరలో విడుదల కానున్న సూర్య ‘కంగువా’ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్(43) అనుమానాస్పదంగా మృతిచెందారు. కొచ్చిలోని పనంపిల్లినగర్లో ఆయన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. ఎలా చనిపోయారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ జావా, వన్, ఉడాల్, ఎగ్జిట్, సౌదీ వెల్లక్కా తదితర మలయాళం సినిమాలకు ఆయన ఎడిటర్‌గా చేశారు. తల్లుమాల సినిమాకు గాను కేరళ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు.
Similar News
News October 30, 2024
JIO SMART GOLD: రూ.10తోనే పెట్టుబడి పెట్టొచ్చు
జియో ఫైనాన్స్ డిజిటల్ గోల్డ్ సేవలను ఆరంభించింది. తమ యాప్‌లోని స్మార్ట్గోల్డ్ ఆప్షన్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చని తెలిపింది. కనీస పెట్టుబడి రూ.10గా పేర్కొంది. ‘కస్టమర్లకు స్మార్ట్గోల్డ్ డిజిటల్, సేఫ్, సెక్యూర్ సేవలు అందిస్తుంది. నగదు, గోల్డ్ కాయిన్స్, నగల రూపంలోకి రిడీమ్ చేసుకోవచ్చు. గోల్డ్‌ను ఇంటికే డెలివరీ చేస్తాం’ అని తెలిపింది. Paytm, PhonePe సైతం ఈ సర్వీసెస్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
News October 30, 2024
ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ సాయిపల్లవి’
సాయి పల్లవి <<14456841>>గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో<<>> ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 12వేలకు పైగా పోస్టులతో బాయ్‌కాట్ సాయిపల్లవి అన్న హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తన తాజా సినిమా అమరన్ తెరకెక్కిన నేపథ్యంలో ఆమె ఢిల్లీలోని అమరవీరుల స్మారక స్తూపాన్ని సందర్శించారు. సినిమా ప్రమోషన్స్ కోసం వార్ మెమోరియల్ వాడుకున్నారంటూ ఆ చర్య కూడా వివాదాస్పదమైంది.
News October 30, 2024
నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు
ఢిల్లీలో నూతన ఏపీ భవన్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్ పేరుతో డిజైన్లకు టెండర్లను పిలిచింది. 11.53 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి వినియోగించుకుంటున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనను ఖరారు చేసుకుని ప్రతిపాదనలు పంపగా కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది.