News October 30, 2024
SVBCకి రూ.55 లక్షల విరాళం
టీటీడీ ఎస్వీబీసీ ట్రస్ట్‌కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ విరాళం ఇచ్చింది. ఆ బ్యాంకు ఎండీ మనీ మేఘలై, జోనల్ హెడ్ ఛైర్మన్ సీవీఎన్ భాస్కరరావు, రీజినల్ హెడ్ గాలి రాంప్రసాద్ రూ.55 లక్షల చెక్కును తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి మంగళవారం మధ్యాహ్నం అందజేశారు.
Similar News
News October 30, 2024
పుంగనూరు: బాలికపై అత్యాచారం..
బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను చౌడేపల్లె మండలం పి.బయప్పల్లెకు చెందిన చరణ్ (23), పుంగనూరు మండలం గూడూరుపల్లెకు చెందిన బి.భార్గవ్ సహకారంతో తిరుపతికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సీఐ తెలిపారు. బాలికను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
News October 30, 2024
చిత్తూరు: ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
చిత్తూరు జిల్లాకు సంబంధించి 2025 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు డిఆర్ఓ పుల్లయ్య మంగళవారం తెలిపారు. అభ్యంతరాలపై నవంబర్ 28 వరకు క్లైములు స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 12 లోపు వాటిని పరిష్కరిస్తామన్నారు. జనవరి 6న తుది జాబితా విడుదల అవుతుందన్నారు. జిల్లాలో మొత్తం 15,66,502 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఇందులో పురుషులు 7,71,264 మంది, మహిళలు 7,95,165 మంది, ఇతరులు 73 మంది ఉన్నారన్నారు.
News October 30, 2024
తిరుపతి IITలో ఉద్యోగావకాశం
తిరుపతి IITలో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇంటర్న్- 04 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్(MLISC) పూర్తి చేసిన అభ్యర్థుల అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు www.iittp.ac.in చూడాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 30.