News November 9, 2025
SVUకు ర్యాగింగ్ మకిలి.. కొత్త అడ్మిషన్ల పరిస్థేంటి.?

గోరుచుట్టపై రోకలిబండలా SVU పరిస్థితి మారింది. ఓ <<18239778>>లెక్చరర్ తీరు<<>>తో అంతంత మాత్రంగా ఉన్న అడ్మిషన్లు మరింత దిగజారే ప్రమాదం నెలకొంది. SVUలో ఇటీవల PG అడ్మిషన్లు తగ్గుతున్నాయి. విద్యార్థులు లేకకొన్ని కోర్సులు మూసేశారు. లాంగ్వేజ్ కోర్సుల పరిస్థితి దయనీయం. ఇలాంటి తరుణంలో వర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. అరకొర అడ్మిషన్లతో నెట్టుకొస్తుంటే ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థుల ఎలా చేరుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి
Similar News
News November 9, 2025
మల్లె మొగ్గలను తొలిచే పురుగుల నివారణ ఎలా?

మల్లె తోటల్లో మొగ్గలను తొలిచి తినే పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని నివారణకు 5 శాతం వేప కాషాయం లేదా థయోక్లోప్రిడ్ 21.7% S.C. 1ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% S.C 0.3ml లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 0.3మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 25% ఇ.సి. 2మి.లీ.లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలుపుకొని మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.
News November 9, 2025
జగిత్యాల జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చలితీవ్రత

జగిత్యాల జిల్లాలో చలి రోజురోజుకు పెరుగుతోంది. గొల్లపల్లి, మన్నెగూడెం, గోవిందారంలో అత్యల్పంగా 14.8℃, పుడూర్, నేరెల్ల, రాఘవపేట, కథలాపూర్ 15.0, పెగడపల్లె, తిరమలాపూర్ 15.1, మల్యాల, మద్దుట్ల, మల్లాపూర్, జగ్గసాగర్, మేడిపల్లి, సారంగాపూర్ 15.3, కోరుట్ల, ఐలాపూర్, గోదూరు 15.4, రాయికల్ 15.5, పొలాస 15.6, జగిత్యాల, మెట్పల్లి 15.7, ఎండపల్లి, గుల్లకోట, సిరికొండ 16.1, అల్లీపూర్లో 16.2℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News November 9, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కవిత

వరంగల్ భద్రకాళి అమ్మవారిని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించారు. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా కలకాలం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలని కవిత ఆకాంక్షించారు.


