News June 15, 2024

SVU డిగ్రీ సెమిస్టర్ పరీక్ష వాయిదా

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈనెల 12వ తేదీ నుంచి డిగ్రీ 2, 4 సెమిస్టర్ రెగ్యులర్/ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 18వ తేదీ జరగాల్సిన పరీక్షను జలై 9వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. 18వ తేదీ UGC NET ఎగ్జామ్ జరుగుతున్న కారణంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News September 21, 2024

తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

image

పెట్రోల్ బంకు క్లియరెన్స్‌లో లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిను సస్పెండ్ చేస్తున్నట్లు రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. పుత్తూరు పెట్రోల్ బంకు ఎన్ఓసీకి రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. విచారణలో నిజమని తేలడంతో ఆయనపై వేటు వేసింది.

News September 20, 2024

సదుం: నాలుగేళ్ల చిన్నారి మృతి

image

అనారోగ్యంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన సదుం మండలంలో శుక్రవారం జరిగింది. జాండ్రపేటకు చెందిన షేహాన్ షా కుమార్తె సభా పర్వీన్ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ పీలేరులో చికిత్స పొందింది. ఈ క్రమంలో నేడు మళ్లీ చిన్నారి హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News September 20, 2024

బంగారుపాళ్యం నుంచే దండయాత్రగా మారింది: లోకేశ్

image

కుప్పం నుంచి చేపట్టిన తన యువగళం యాత్ర బంగారుపాళ్యం నుంచి దండయాత్రగా మారిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళాన్ని అడ్డుకునేందుకు ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చి అడ్డంకులు సృష్టించింది. అయినా భయపడలేదు. నాపై 23 కేసులు నమోదు చేశారు. పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సూపర్-6 పథకాలు ఉపయోగపడతాయి. సీఎం చంద్రబాబుతో చర్చించి వాటిని అమలు చేస్తా’ అని లోకేశ్ చెప్పారు.