News September 30, 2024
SVU : నేడే లాస్ట్ డేట్.. Don’t Miss It

SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.
Similar News
News July 10, 2025
నెల్లూరు: సాంబారులో బల్లి

నెల్లూరులోని ఓ ప్రముఖ హోటల్ ఆహరంలో బల్లి వచ్చిన ఘటన బుధవారం వెలుగు చూసింది. నగరంలోని ఓ హోటల్‌లో రాత్రి రూ.70 పెట్టి భోజనం కొన్న కస్టమర్ సాంబార్లో బల్లి కనిపించడంతో కంగుతిన్నాడు. ఇదేమిటని హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు నిర్లక్షంగా సమాధానం ఇచ్చినట్లు ఆయన వాపోయాడు. అదే సాంబారును హోటల్ నిర్వాహకులు కస్టమర్లకు పంపిణీ చేశారని ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ సేకరించారు.
News July 10, 2025
రొట్టెల పండగకు వచ్చిన 2 లక్షల మంది భక్తులు

నెల్లూరు బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా నాలుగో రోజైన బుధవారం 2 లక్షల మందికిపైగా భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించింది. భక్తుల రద్దీతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.
News July 9, 2025
అంతర్జాతీయ స్థాయిలో ముత్తుకూరు యువతి సత్తా

అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ పోటీల్లో ముత్తుకూరు మండలానికి చెందిన వి. భవాని అద్భుత ప్రతిభ కనబరిచారు. రెండు స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణంగా గెలిచారు. ఈ మేరకు ఆమెను బుధవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. వికలాంగులు ఈ విధంగా ప్రపంచ స్థాయిలో ప్రతిభను చాటుకోవడం హర్షనీయమన్నారు.