News September 30, 2024
SVU : ఫీజు చెల్లించడానికి నేడు చివరి తేదీ
SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.
Similar News
News October 9, 2024
మదనపల్లె జిల్లా ఇప్పుడే కాదు: చంద్రబాబు
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
News October 9, 2024
చిత్తూరు నూతన DFOగా భరణి
చిత్తూరు జిల్లా నూతన అటవీశాఖ అధికారిణిగా భరణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేస్తున్న చైతన్య కుమార్ రెడ్డిని ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ నుంచి బదిలీపై వచ్చిన భరణి నూతన డీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. అందరి సహకారంతో అటవీశాఖ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
News October 9, 2024
12న స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్)కు విజయదశమి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ శనివారం ఓపీ, ఓటీ సేవలు అందుబాటులో ఉండవు. స్విమ్స్ అత్యవసర విభాగం(క్యాజువాలిటీ) సేవలు యథాతథంగా కొనసాగుతాయని వీసీ ఆర్.వి.కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.