News October 21, 2024
SVU: వర్సిటీల్లో స్పాట్ అడ్మిషన్లకు నేడే అఖరి

తిరుపతి ఎస్వీయూ, పద్మావతి యూనివర్సిటీల్లో మిగిలిన PG కోర్సుల స్పాట్ అడ్మిషన్లకు నేడే చివరి రోజని ఆయా యూనివర్సిటీల అధికారులు తెలిపారు. AP PG SET-2024 అర్హత సాధించి, రెండు విడతలుగా జరిగిన కౌన్సెలింగ్లో సీటు రాని వారు ఆయా వర్సిటీల్లో స్పాట్ అడ్మిషన్లకు ఓరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని అధికారులు ప్రకటనలు విడుదల చేశారు.
Similar News
News November 11, 2025
పూతలపట్టు: అదుపుతప్పి ఐచర్ వాహనం బోల్తా

పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలో గల జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు వైపు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఐచర్ వాహనం అతివేగంగా వెళ్లి బోల్తా పడింది. ఇందులో ఉన్న దానిమ్మ కాయలు కోసం ప్రజలు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్కి స్వల్ప గాయాలు అయ్యాయి.
News November 11, 2025
చిత్తూరు: విస్తృతంగా పోలీసుల తనిఖీ

ఢిల్లీలో జరిగిన దాడుల నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా అన్ని ముఖ్యమైన రహదారులు, చెక్పోస్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. లాడ్జిలు, హోటళ్లలో సైతం తనిఖీలు చేశారు. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News November 10, 2025
రేపు జిల్లాలో నాలుగు పరిశ్రమల స్థాపనకు CM ప్రారంభోత్సవం

జిల్లాలో నాలుగు నూతన పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో మంగళవారం ప్రారంభోత్సవం చేస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు, కుప్పం, పుంగనూరు, నగరి మండలాల పరిధిలో 116 ఎకరాలలో రూ.56.76 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలలో సంబంధిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు.


