News October 21, 2024
SVU: వర్సిటీల్లో స్పాట్ అడ్మిషన్లకు నేడే అఖరి
తిరుపతి ఎస్వీయూ, పద్మావతి యూనివర్సిటీల్లో మిగిలిన PG కోర్సుల స్పాట్ అడ్మిషన్లకు నేడే చివరి రోజని ఆయా యూనివర్సిటీల అధికారులు తెలిపారు. AP PG SET-2024 అర్హత సాధించి, రెండు విడతలుగా జరిగిన కౌన్సెలింగ్‌లో సీటు రాని వారు ఆయా వర్సిటీల్లో స్పాట్ అడ్మిషన్లకు ఓరిజినల్ సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని అధికారులు ప్రకటనలు విడుదల చేశారు.
Similar News
News November 14, 2024
తిరుపతి: కాలేజీలో విద్యార్థిని సూసైడ్
తిరుపతి శ్రీపద్మావతి డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థి ఊరి వేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గురువారం కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుంది. అయితే విద్యార్థిని మృతి చెందినట్లు తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నాయి. మీడియా, సంఘాలను పోలీసులు గేటు వద్ద అడ్డుకుని, లోపల విచారిస్తున్నారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
News November 14, 2024
తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక
తిరుమల శ్రీవారికి ఓ భక్తురాలు భారీ బంగారు కానుకను ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా సుమారు రూ.2 కోట్లు విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ విరాళమిచ్చారు. ఈవైజయంతీ మాలను ఉత్సవమూర్తులకు టీటీడీ అలంకరించనుంది. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీ మాలను రేపు విరాళం ఇవ్వనున్నట్లు దాత తెలిపారు.
News November 14, 2024
తిరుపతి వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
తిరుపతి రూరల్ (మం) వేదాంతపురం నేషనల్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల గృహ ప్రవేశం కోసం బెంగళూరు నుంచి కారులో వస్తుండగా వారిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి రుయాకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.