News December 29, 2025

SVU : డిగ్రీ ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో B. Sc/ B.Com/ B.A/ B.B.A/ B. Voc/ B.H.M/ B.M.U.S డిగ్రీ (UG) రెగ్యులర్ రెండవ (2వ) సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు. అభ్యర్థుల ఈ విషయాన్ని గమనించగలరు.

Similar News

News February 21, 2026

జనగామ: 23న కేంద్ర బృందం పర్యటన: కలెక్టర్

image

దేశ వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన ఐదు జిల్లాల్లో జనగామ జిల్లా ఒకటిగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లాలో RPRP కింద 46 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమగ్రంగా పరిశీలించేందుకు ఈ నెల 23న కేంద్ర బృందం రానుందని తెలిపారు. జిల్లాలో అమలైన కేంద్ర పథకాలు, లబ్ధిదారుల వివరాలు, సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

News February 21, 2026

ఆమదాలవలస: అస్వస్థతకు గురై ప్రయాణికుడు మృతి

image

శ్రీకాకుళం నుంచి పాలకొండకు బస్సులో వెళ్తున్న ప్రయాణికుడు శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. చింతాడ వద్ద బస్సును ఆపి తోటివారు, సిబ్బంది 108కు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్ అక్కడికి చేరుకొని ప్రయాణికుడిని 108 సిబ్బంది పరీక్షించగా అప్పటికే మృతి చెందాడు. గుండెపోటుతో మరణించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 21, 2026

తిరుమల శ్రీవారితో వైసీపీ రాజకీయం చేస్తుంది: మంత్రి సుభాశ్

image

తిరుమల శ్రీవారిని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆరోపించారు. శనివారం మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని మంత్రి ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను వైసీపీ నాయకులు పదేపదే దెబ్బతీస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు బుద్ధి మార్చుకోవాలని ఆయన వ్యాఖ్యనించారు.