News February 26, 2026
SVU: డిగ్రీ విద్యార్థులకు గమనిక

SVU పరిధిలో (UG) డిగ్రీ మొదటి, రెండో, మూడో సంవత్సర ఇయర్ ప్యాటర్న్ (వార్షిక విధానం) పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు హాల్ టికెట్లను పొందని వారు పరీక్ష సమయానికి ముందుగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్ద పొందవచ్చని సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
Similar News
News February 27, 2026
బరువు తగ్గాలా? వీటిని డైట్ నుంచి తీసేయండి

బరువు తగ్గాలనుకునేవారు కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూస్‌లు, ఫాస్ట్ ఫుడ్‌ని వెంటనే డైట్ నుంచి తొలగించాలని నిపుణులు చెబుతున్నారు. వైట్ బ్రెడ్, బిస్కెట్ల వంటి రిఫైన్డ్ కార్బ్స్ రక్తంలో షుగర్ లెవెల్స్‌ని పెంచి ఆకలిని కలిగిస్తాయి. అలాగే బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, మయోనైజ్ వంటి హై క్యాలరీ సాస్‌లకు దూరంగా ఉండాలి. వీటికి బదులు హోల్ గ్రెయిన్స్, నట్స్, పండ్లు, నీళ్లు ఎక్కువగా తాగితే హెల్తీగా బరువు తగ్గొచ్చు.
News February 27, 2026
బాపులపాడు డిప్యూటీ ఎంపీడీఓపై సస్పెన్షన్ వేటు

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాపులపాడు మండల డిప్యూటీ ఎంపీడీఓ లక్ష్మయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. లక్ష్మయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పన్ను వసూళ్లలో పురోగతి సాధించకపోవడం, సమీక్షా సమావేశాలకు గైర్హాజరు అవుతుండటం, OHSR ట్యాంక్‌లను పరిశుభ్రపర్చడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీఓను సస్పెండ్ చేశారు.
News February 27, 2026
ASF: సృజనకు బ్రెయిన్ డెడ్.. నలుగురికి కొత్త జీవితం

ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్‌లో బ్రెయిన్ డెడ్ అయిన ఈస్త సృజన(34) అవయవాలను దానం చేసి నలుగురికి జీవితం ప్రసాదించారు బాధిత కుటుంబీకులు. తల్లిదండ్రుల ఇంట్లో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సృజన ICUలో చికిత్స పొందినా ప్రాణం దక్కలేదు. భర్త నాగరాజు అంగీకరించడంతో కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించి అవసరంలో ఉన్నవారికి అమర్చారు. సృజన మృతితో గ్రామం కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబాన్ని అభినందించింది.


