News April 21, 2025

SVU పరీక్షల వాయిదా

image

తిరుపతి SVUలో ఈనెల 22, 23వ తేదీల్లో ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అధికారి దామ్లా నాయక్ వెల్లడించారు. మొదటి రెండు రోజులకు సంబంధించి అన్ని పరీక్షలను మే 12, 14వ తేదీ తిరిగి నిర్వహిస్తామని తెలిపారు. 24వ తేదీ నుంచి మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Similar News

News December 24, 2025

రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ రావు ధ్వజం

image

TG: వాదనలో విఫలమై, నిజాలు చెప్పే దమ్ము లేనప్పుడు వ్యక్తిగత దూషణలు మాత్రమే ఉంటాయంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. రేవంత్ రాక్షస భాషను, చిల్లర చేష్టలను, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం సునిశితంగా గమనిస్తోందని తెలిపారు. అహంకారం తలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న ఆయనను ప్రజలు క్షమించరని, 2028 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హరీశ్ ఫైర్ అయ్యారు.

News December 24, 2025

పంట రుణాల నిర్ణయంలో రైతులకు భాగస్వామ్యం: కలెక్టర్

image

జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల రైతాంగానికి పంట రుణాల మంజూరు ఆర్ధిక స్థాయిని నిర్ణయించే సమయంలో రైతులను కూడా భాగస్వాములను చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం వ్యవసాయ అనుబంధ రంగాల పంట రుణాల నిర్ణయంపై సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించారు. కౌలు రైతుకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News December 24, 2025

విశాఖ: రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

image

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బుధవారం పరిహారం అందజేశారు. చిలకపల్లి రమేష్ హిట్‌ అండ్‌ రన్‌లో మరణించగా.. ఆయన భార్య చిలకపల్లి నీలమణి అకౌంట్‌లో రూ.2 లక్షలు జమ చేశామని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఇప్పటి వరకు విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హిట్ అండ్ రన్‌‌ కేసుల్లో 102 మంది బాధితులకు మొత్తం రూ.84లక్షలు అందించినట్లు చెప్పారు.