News December 20, 2025

SVU: ప్రొఫెసర్ కావాలంటూ పీజీ విద్యార్థులు కోరారు..?

image

తిరుపతి ఎస్వీయూలో ర్యాగింగ్ విచారణ నుంచి బయట పడ్డ ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి కావాలంటూ పీజీ విద్యార్థులు కోరారని ప్రచారం జరుగుతోంది. సైకాలజీ విభాగంలో సిబ్బంది తక్కువ ఉండడంతో తీసుకున్నారంటూ అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే నెల రోజులు గడవక ముందే.. కేసు విచారణలో ఉండగా ఆయనను తీసుకోవడం పై విద్యార్థి సంఘాలు పోరాటానికి సిద్ధం అవుతున్నారు.

Similar News

News December 21, 2025

శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.

News December 21, 2025

చిత్తూరు మామిడి రైతులకు ముఖ్య గమనిక

image

మామిడి రైతులకు డిసెంబర్ నెల కీలకమని చంద్రగిరి HO అధికారిణి శైలజ అన్నారు. పూతదశకు ముందు నీటి తడులు ఆపితే చెట్టు ఒత్తిడికి లోనై మంచి పూత వస్తుందన్నారు. పిండి పురుగు పైకి ఎక్కకుండా కాండం చుట్టూ 25 సెం.మీ ప్లాస్టిక్ కవర్ కట్టి గ్రీజు రాయాలని, పూత సమంగా రావడానికి 13-0-45 నిష్పత్తిలో పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి 10 గ్రా.కలిపి పిచికారీ చేయాలన్నారు. పాదుల్లో కలుపు తీసి,ఎండిన కొమ్మలు కత్తిరించాలన్నారు.

News December 21, 2025

సిద్దిపేట: తీవ్ర విషాదం.. దంపతుల ఆత్మహత్య

image

పురుగు మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెజ్జంకిలో జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని దాచారానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు. వారు బెజ్జంకిలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం భార్యాభర్తలు పురుగు మందు తాగారు. ఘటనా స్థలంలో భార్య మృతి చెందగా, భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దంపతుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.