News July 5, 2024

SVU ఫలితాలు విడుదల

image

SVU: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మొదటి సెమిస్టర్, మూడవ సెమిస్టర్ రీవాల్యూయేషన్ ఫలితాలు విడుదల చేశారు. స్టూడెంట్స్ తమ ఫలితాలను SVU వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ధామాల నాయక్ తెలిపారు. దీ దీంతోపాటు ఫలితాలను www.manabadi.com వెబ్‌ సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 30, 2026

చిత్తూరు పోలీసులకు 35 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 35 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 5, ఆస్తి తగాదాలు 3, భూతగాదాలు 14 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

News March 30, 2026

చిత్తూరులో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 1100కు కాల్ చేయడంతో పాటు Meekosam.ap.gov.inకు మెయిల్ చేసి కూడా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావచ్చని సూచించారు.

News March 29, 2026

సమన్వయంతోనే ఆహార శుద్ధి రంగ అభివృద్ధి: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆహార శుద్ధి రంగ అభివృద్ధికి సమన్వయం అత్యంత అవసరమని సూచించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్ సౌత్ జోన్ ఛైర్మన్‌గా రెండోసారి ఎన్నికైన కట్టమంచి బాబీని సత్కరించారు. పరిశ్రమలు, రైతుల మధ్య పటిష్టమైన సమన్వయం ఉండాలన్నారు. కార్యక్రమంలో తలుపులపల్లి బాబురెడ్డి, శివకుమార్, శివారెడ్డి మరియు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.