News December 31, 2024

SVU: ‘మెడికల్ దందాపై విచారణ జరపాలి’

image

SVU హెల్త్ సెంటర్ నందు గత ప్రభుత్వ హయాంలో అనేక మెడికల్ దందాలు జరిగాయని TNSF రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్కే నాయుడు, రాష్ట్ర నాయకులు చిన్న, AISF యూనివర్సిటీ అధ్యక్షులు రంజిత్ ఆరోపించారు. విద్యార్థులు ఏ అనారోగ్య సమస్యతో వెళ్లిన ఒకే రకమైన మందులు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం రిజిస్ట్రార్ భూపతి నాయుడుకి వినతి పత్రం అందజేశారు. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 3, 2025

తిరుపతి: ఉచితాలు వద్దని TTD ఛైర్మన్ డైరీలు కొనుగోలు

image

ఏటా టీటీడీ గౌరవప్రదంగా అందజేసే నూతన ఏడాది డైరీ, క్యాలెండర్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సున్నితంగా తిరస్కరించారు. సాధారణంగా ఛైర్మన్‌కు టీటీడీ ఉచితంగా 75 డైరీలు, 75 క్యాలండర్లు ఇస్తుంది. వీటిని ఆయన తిరస్కరించి.. కొన్ని డైరీలను, క్యాలెండర్లను సొంత నగదుతో కొనుగోలు చేసి సన్నిహితులకు అందజేశారు.

News January 3, 2025

చిత్తూరు: 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

కడప జోన్-4 పరిధిలో 150 స్టాఫ్ నర్సు పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఎంహెచ్ఎఓ సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తి చేసి కడపలోని ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు https://cfw.ap.nic.in/ను సంప్రదించాలన్నారు.

News January 2, 2025

చిత్తూరు: కానిస్టేబుళ్ల ఎంపికకు 394 మంది హాజరు

image

చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కానిస్టేబుల్‌ల ఎంపిక కార్యక్రమం మూడోరోజు కొనసాగినట్టు పోలీసులు తెలిపారు. 599 మంది అభ్యర్థులకు 394 మంది హాజరు కాగా 163 మంది అర్హత సాధించినట్టు వారు చెప్పారు. శుక్రవారం మహిళల అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. 495 మంది హాజరుకానున్నట్టు చెప్పారు.