News February 16, 2025

SVU: 24 నుంచి దూరవిద్య పరీక్షలు ప్రారంభం

image

శ్రీ వెంకటేశ్వర దూరవిద్య (SVU DDE) డిగ్రీ, పీజీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంది. వాస్తవానికి ఈ పరీక్షలు ఈనెల 3వ తేదీ నుంచి జరగాల్సింది. అనివార్య కారణాలవల్ల వాయిదా వేశారు. 24వ తేదీ నుంచి జరగనున్నట్లు నూతన షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 8వ తేదీ నుంచి ఎంబీఏ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని వారు సూచించారు.

Similar News

News March 27, 2025

బంజారాహిల్స్‌లో ఇఫ్తార్ విందులో మేయర్ విజయలక్ష్మీ

image

రంజాన్ మాసం పర్వదినం పురస్కరించుకొని బంజారాహిల్స్‌లో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ మేయర్, కార్పొరేటర్ కవితా, టి. నారాయణ రెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లిం సోదరులకు ఉపవాస దీక్షను విరమింపజేశారు. రంజాన్ మాసం పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇస్తార్ విందు ఇవ్వడం అభినందనీయమని మేయర్ అన్నారు.

News March 27, 2025

ఖమ్మం: POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

image

కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో నేడు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా, ఖమ్మం డీసీసీ చీఫ్‌గా పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ ఉన్నారు. అయితే ఈ పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాధాకిషోర్, దీపక్ చౌదరి పోటీ పడుతున్నారు.

News March 27, 2025

పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచే లక్ష్యంగా పల్లెనిద్ర: ఎస్పీ

image

ప్రజలు శాంతియుత జీవనంలో కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెనిద్ర చేపట్టినట్లు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో MPUP స్కూల్‌లో ఎస్పీ, పోలీసు అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు. 

error: Content is protected !!