News February 16, 2025
SVU: 24 నుంచి దూరవిద్య పరీక్షలు ప్రారంభం

శ్రీ వెంకటేశ్వర దూరవిద్య (SVU DDE) డిగ్రీ, పీజీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంది. వాస్తవానికి ఈ పరీక్షలు ఈనెల 3వ తేదీ నుంచి జరగాల్సింది. అనివార్య కారణాలవల్ల వాయిదా వేశారు. 24వ తేదీ నుంచి జరగనున్నట్లు నూతన షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 8వ తేదీ నుంచి ఎంబీఏ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని వారు సూచించారు.
Similar News
News November 12, 2025
బాల్య వివాహాలు ఎలా మొదలయ్యాయి?

బాల్య వివాహాలు ముందు నుంచే లేవు. క్రీస్తు పూర్వం 4 సంవత్సరం నుంచి ఇవి మొదలయ్యాయి. బొమ్మల పెళ్లిళ్లు వీటికి దోహదం చేశాయి. పరదేశీయులు దండయాత్రల్లో తమకు చిక్కిన ఆడపిల్లలను చెరిపేవారు. ఇలాంటి దుస్థితి రాకూడదని తల్లిదండ్రులు తమ బిడ్డలకు త్వరగా పెళ్లి చేసి అత్తారిండ్లకు పంపేవారు. అయితే ఈ సంస్కృతి కారణంగానే ఆడపిల్లలు వేదాలు చదవడం, విద్యను అభ్యసించడం నిషిద్ధం అనే దుష్ప్రచారం మొదలైంది. <<-se>>#Pendli<<>>
News November 12, 2025
భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. కనిష్ఠంగా 8.7 డిగ్రీలు నమోదు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. నిన్న తెలంగాణలో అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠంగా ఆసిఫాబాద్‌లోని లింగాపూర్‌లో 8.7 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో 14.7, మచ్చబొల్లారం, గచ్చిబౌలిలో 15 డిగ్రీలు నమోదైనట్లు వెల్లడించింది. రాబోయే రోజుల్లో టెంపరేచర్లు మరింత పడిపోతాయని హెచ్చరించింది.
News November 12, 2025
కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.73,18,504

కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. స్వామి వారికి 76 రోజుల్లో రూ.73,18,504 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి టి.వెంకటేష్ తెలిపారు. 80 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 800 గ్రాముల మిశ్రమ వెండి, 21 విదేశీ నోట్లు వచ్చాయన్నారు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ అర్చకులు, సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


