News September 27, 2024
SVU: M.Tech ఫలితాలు విడుదల

తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో M.Tech (CBCS) 3వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Similar News
News March 26, 2026
జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

జనగణన కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మూడు రోజుల జనగణన శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. కుప్పం, పలమనేరు, నగరి డివిజన్లకు సంబంధించిన ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 15 సంవత్సరాల వరకు ఈ జనగణన ప్రభావం చూపుతుందన్నారు.
News March 26, 2026
చిత్తూరు DMHO బదిలీలో మూడవ జీవో

చిత్తూరు డీఎంహెచ్వో సుధారాణి బదిలీకి సంబంధించి ప్రభుత్వం మూడో జీవో జారీ చేసింది. ఆమెను విజయవాడలోని పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ వద్ద రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆమె స్థానంలో నాగ శశిభూషణ్ రెడ్డిని డీఎంహెచ్వోగా నియమించారు. చిత్తూరులోనే విధులు కొనసాగేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పలువురు పేర్కొంటున్నారు.
News March 26, 2026
ఇవాళ స్కూళ్లకు సెలవు లేదు: చిత్తూరు DEO

జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలు గురువారం పని చేస్తాయని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన పాఠశాలలకు సెలవు ఉంటుందని డీఈవో పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు. ఇది వరకు 26(నేడు) శ్రీరామనవమి సందర్భంగా సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.


