News October 20, 2024

SVU: PG ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూలై నెలలో (PG) ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, ఎంఎస్సీ ఇండస్ట్రియల్ మైక్రో బయాలజీ నాల్గో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

Similar News

News November 10, 2024

ఇస్తాంబుల్ సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి

image

టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు. ప్రపంచ పర్యావరణ మార్పులు.. వాటి పరిణామాలపై జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇందులో ప్రపంచంలోని 40 దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. గ్రీన్ జోన్లలో మరింత పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాలపై చర్చలు జరిగాయి.

News November 10, 2024

కె.వి.పల్లె: APSWR పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య..?

image

కె.వి.పల్లి మండలం APSWR పాఠశాలలో ఇవాళ ఉదయం విద్యార్థి రెడ్డి మోక్షిత్ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థి హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకోగా తోటి విద్యార్థులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మోక్షిత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

News November 10, 2024

ఉమ్మడి చిత్తూరులో బెస్ట్ టీచర్ అవార్డులు వీరికే..!

image

➤ కూనాటి సురేశ్(ఊరందూరు, జాతీయ అవార్డు)
➤ కె.శ్రీధర్ బాబు(హెచ్ఎం, మేలుమాయి)
➤ బి.సురేంద్రబాబు(కాణిపాకం జడ్పీ స్కూల్)
➤ కె.బాలసుబ్రహ్మణ్యం(దిగువసాంబయ్యపాలెం)
➤ టి.ఆనంద్(పల్లాం)
➤ డా.పి.ప్రభాకర్ రావు(ఎ.రంగంపేట)
➤ ఎం.సుబ్రహ్మణ్యం(బండారుపల్లి)
➤ వి.కామాక్షయ్య(రాజానగరం)
➤ వి.అనిత(కలకడ కేజీబీవీ ప్రిన్సిపల్)
➤ నాగరత్నమ్మ(పెద్దమండ్యం కేజీబీవీ)
➤ బి.మంజువాణి(కేవీబీపురం కేజీబీవీ)