News February 4, 2026
SVU: PG ఫలితాలు విడుదల

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో పీజీ మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (M. Pharmacy) రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఫలితాలను https://www.results.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు.
Similar News
News February 4, 2026
పల్లె నుంచి ఢిల్లీకి.. రేణుకను అభినందించిన కలెక్టర్

ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ‘లక్పతి దీదీ’ కుర్ర రేణుకను సిద్దిపేట కలెక్టర్ హైమావతి సన్మానించారు. వెదురు కర్రలతో నూతన పద్ధతిలో సోఫా సెట్లు, గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేస్తూ లాభాలు గడిస్తున్న ఆమెను కలెక్టర్ ఆదర్శంగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళలు బిజినెస్ ఎంటర్‌ప్రైజ్‌లలో రాణించడం గర్వకారణమని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
News February 4, 2026
మున్సిపల్ ప్రచారానికి సీఎం.. మిర్యాలగూడలో తొలి సభ

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో, రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, ఎల్లుండి నిజామాబాద్ జిల్లాలో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో, 9న మెదక్‌లో నిర్వహించే ఎన్నికల సభల్లో రేవంత్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
News February 4, 2026
నారాయణఖేడ్: మున్సిపల్ బరిలో బాబాయి.. అబ్బాయి

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల బరిలో ఒకే కుటుంబానికి చెందిన బాబాయి, అబ్బాయి బరిలో నిలిచారు. జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ కుమార్ శెట్కార్ 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ శెట్కార్ 7వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఒకే పార్టీ తరఫున వేర్వేరు వార్డుల్లో పోటీ పడుతున్న ఈ బాబాయి, అబ్బాయిల ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది.


