News August 5, 2024
SVU : PG ఫలితాలు విడుదల

తిరుపతి : శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో ఈ ఏడాది (PG) M.A, M.Sc 1, 3 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Similar News
News February 8, 2026
హాస్టళ్లకు సమస్యల గ్రహణం.. ఇప్పుడన్న వీడేనా.?

జిల్లాలో మొత్తం 113 వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. పలు హాస్టల్స్‌లో సమస్యలు తిష్ట వేశాయి. వీటిని నెట్ జీరో ప్రాంగణాలుగా తీర్చిదిద్దేలా కలెక్టర్ ఇటీవల సమావేశం నిర్వహించారు. ప్రతి హాస్టల్‌లో ఆర్ఓ ప్లాంట్, టాయిలెట్స్, విద్యుత్, ఫ్యాన్, సోలార్ లైటింగ్, కిచెన్ గార్డెన్లు ఉండాలని సూచించారు. ఇందుకోసం నివేదికలు అందజేయాలని సూచించారు. ఇకనైనా సమస్యలు పరిష్కారం అవుతాయేమోనని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
News February 8, 2026
చిత్తూరు: రైతన్నకు మారింత భారంగా..

రబీ సీజన్లో ఎరువుల ధరలు పెరుగుతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే రెండుసార్లు ఎరువుల ధరను పెంచారు. గతంలో వివిధ రకాల ఎరువుల బస్తాలు రూ. 1550 నుంచి 1600 వరకు లభించేది. ప్రస్తుతం వాటి ధరలు రూ. 50 నుంచి 150 రూపాయల వరకు పెరిగాయి. పంటలకు అంతంత మాత్రంగా ఉన్న గిట్టుబాటు ధరలతో నష్టపోతున్న రైతులకు ఎరువుల ధర భారమవుతోంది.
News February 8, 2026
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు తెలియజేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లాడ్జీలు, బస్సు స్టాండ్ లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యాల కేసులలో పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


