News February 4, 2026

SVU: PG ఫలితాలు విడుదల

image

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో పీజీ మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (M. Pharmacy) రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఫలితాలను https://www.results.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు.

Similar News

News February 4, 2026

మున్సిపల్ ప్రచారానికి సీఎం.. మిర్యాలగూడలో తొలి సభ

image

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో, రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, ఎల్లుండి నిజామాబాద్ జిల్లాలో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో, 9న మెదక్‌లో నిర్వహించే ఎన్నికల సభల్లో రేవంత్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

News February 4, 2026

నారాయణఖేడ్: మున్సిపల్ బరిలో బాబాయి.. అబ్బాయి

image

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల బరిలో ఒకే కుటుంబానికి చెందిన బాబాయి, అబ్బాయి బరిలో నిలిచారు. జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ కుమార్ శెట్కార్ 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ శెట్కార్ 7వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఒకే పార్టీ తరఫున వేర్వేరు వార్డుల్లో పోటీ పడుతున్న ఈ బాబాయి, అబ్బాయిల ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది.

News February 4, 2026

మనుబోలులో విజిలెన్స్ దాడులు.. రూ.కోటి సరుకు స్వాధీనం

image

మనుబోలులోని పెట్రోల్ బంక్ సమీపంలో జ్యన్తి మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా ఇండస్త్రిరియల్ ఆయిల్‌ను డీజిల్‌గా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆయిల్ తీసుకొచ్చి అమ్ముతున్నారన్నారు. రూ.లక్షా పదివేల లీటర్ల ఆయిల్‌ను, అయిదు ట్యాంకర్లను సీజ్ చేశారు.