News May 18, 2024

స్వాతి మలివాల్ శరీరంపై నాలుగు చోట్ల గాయాలు: AIIMS

image

ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమెపై <<13262229>>దాడి<<>> నిజమేనని AIIMS వైద్యులు నిర్ధారించారు. స్వాతి ఎడమ కాలు, కుడి కన్ను కింద సహా శరీరంలోని నాలుగు భాగాలకు గాయాలయ్యాయని నివేదిక ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్వాతి అనధికారికంగా సీఎం నివాసంలోకి ప్రవేశించి తనపై దాడి చేశారని బిభవ్ కూడా ఫిర్యాదు చేశారు.

Similar News

News October 26, 2025

రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు: APSDMA

image

AP: ‘మొంథా’ తుఫాను ఎల్లుండి రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. SKL, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూ.గో., ఏలూరు, NTR, GNT, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.

News October 26, 2025

ఇందిరమ్మ ఇళ్లు: చెల్లింపుల్లో స్వల్ప మార్పులు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బేస్‌మెంట్ వరకు రూ.లక్ష, రూఫ్ లెవల్ వరకు రూ.లక్ష, శ్లాబ్ వేశాక రూ.2 లక్షలు, చివర్లో రూ.లక్ష చొప్పున 4 విడతల్లో రూ.5 లక్షలిస్తున్నారు. ఇక నుంచి శ్లాబ్ వేశాక రూ.1.40 లక్షలే ఖాతాలో జమ అవుతాయని మంత్రి చెప్పారు. మిగతా రూ.60 వేలను ఉపాధి హామీ పథకం కింద ఇస్తామన్నారు.

News October 26, 2025

తులసి మొక్క ఇంటికి ఏ దిశలో ఉండాలి?

image

ప్రతి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘తులసి ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ మొక్క సూర్యునికి అభిముఖంగా, తూర్పు దిశలో ఉండటం శ్రేయస్కరం. ఉత్తరంలోనూ ఉండొచ్చు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోడానికి ఉదయం కొంత సమయం తులసి దగ్గర గడపాలి. ఈ మొక్క ఎదుగుదల ఇంట్లోవారికి కొన్ని సూచనలిస్తుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>