News January 4, 2025
క్యాబినెట్ భేటీ తర్వాత రైతులకు తీపికబురు: పొంగులేటి
TG: మరికాసేపట్లో జరగబోయే క్యాబినెట్ భేటీ తర్వాత రైతులు తీపి కబురు వింటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 80 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 30 లక్షల అప్లికేషన్లపై యాప్ ద్వారా సర్వే చేశాం. త్వరలోనే లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేపడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News January 6, 2025
BREAKING: దేశంలో 4కి చేరిన HMPV కేసులు
దేశంలో HMPV కేసులు పెరుగుతున్నాయి. కోల్‌కతాలో 5 నెలల చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇవాళ ఒక్క రోజే 4 నాలుగు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో రెండు, అహ్మదాబాద్‌లో ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే.
News January 6, 2025
ఆయన కోచ్‌గా ఉన్నప్పుడే బాగుంది: హర్భజన్
రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత జట్టు ప్రదర్శన బాగుందని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. గత ఆర్నెళ్లుగా టీమ్ ఇండియా పర్ఫార్మెన్స్ ఆందోళనకరంగా ఉందని తన యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. ఇంగ్లండ్‌తో జరగబోయే మ్యాచుల్లో భారత జట్టు సత్తా చాటాల్సి ఉందని తెలిపారు. రోహిత్, కోహ్లీ ఎవరైనా ఆట కంటే ఎక్కువ కాదని, మెరుగ్గా ఆడితేనే ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డారు.
News January 6, 2025
25 లక్షల కంటే ఎక్కువ జీతం పొందుతున్న వారు ఎంతమందో తెలుసా?
దేశంలో ఆదాయ పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి జీతాలు ఇలా ఉన్నాయి. ఏడాదికి 5 లక్షల నుంచి 10 లక్షల జీతం ఉన్నవారు 1.28 కోట్ల మంది. 10L నుంచి 15L వరకు ఉన్నవారు 50 లక్షలు, 15L – 20L జీతం ఉన్నవారు 19L మంది, 20L – 25L వారు 9 లక్షలు, 25 L నుంచి 50 L జీతం పొందుతున్నవారు 13 లక్షల మంది ఉన్నారు. ఇంతకీ మీరు ఏ స్లాబ్‌లో ఉన్నారు