News September 27, 2024

₹10,000 కోట్లతో స్విగ్గీ IPO

image

ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ గురువారం సెబీ వద్ద IPO పేపర్లను సబ్మిట్ చేసింది. ₹10వేల కోట్ల విలువతో వస్తోంది. పేటీఎం (₹18,300 కోట్లు) తర్వాత భారత్‌లో అత్యంత విలువైన స్టార్టప్ IPO ఇదే. వచ్చే వారం షేర్‌హోల్డర్ల మీటింగ్ తర్వాత ఈ విలువను ₹11,700 కోట్లకు పెంచుతారని అంచనా. ఫ్రెష్ ఇష్యూ ద్వారా ₹3750 కోట్లు, OFS ద్వారా మిగిలిన డబ్బును సమీకరిస్తారు. స్విగ్గీ రైవల్ జొమాటో ₹9,375 కోట్లతో IPOకు వచ్చింది.

Similar News

News September 27, 2024

ఆ డేటింగ్ యాప్‌లో హీరోలూ ఉన్నారు: ఊర్వశీ రౌతేలా

image

తనతోపాటు చాలా మంది సెలబ్రిటీలు ‘రాయ’ డేటింగ్ యాప్‌లో ఉన్నారని హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తెలిపారు. మాట్లాడుకోవడం కోసమే ఈ యాప్‌లో చేరినట్లు ఆమె చెప్పారు. హృతిక్ రోషన్, ఆదిత్యరాయ్ కపూర్, అర్జున్ కపూర్ వంటి స్టార్లు యాప్‌లో చేరారని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ కోసమే ఈ యాప్‌లో చేరానని, దీనిని మరో కోణంలో చూడొద్దని ఆమె అన్నారు. కాగా టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్‌తో ఊర్వశి డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి.

News September 27, 2024

లడ్డూ వివాదంపై వైవీ పిటిషన్.. 4న సుప్రీంకోర్టులో విచారణ

image

AP: తిరుమల లడ్డూపై వివాదంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 4న అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. సీఎం చంద్రబాబు ఏర్పాటుచేసిన సిట్‌తో వాస్తవాలు వెలుగులోకి రావని, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరగాలని ఆయన కోరుతున్నారు.

News September 27, 2024

BIG SHOCK: షిప్‌యార్డులో మునిగిపోయిన చైనా న్యూక్లియర్ సబ్‌మెరైన్!

image

సముద్రంలో ట్రయల్స్ కోసం సిద్ధం చేసిన చైనా జోహూ క్లాస్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ మునిగిపోయిందని సమాచారం. మేలో వుహాన్ సిటీలో యాంగ్జీ నదీ తీరంలో దీనిని డాక్ చేసినట్టు శాటిలైట్ ఇమేజెస్‌ ద్వారా US గుర్తించింది. జూన్‌లో చూస్తే అక్కడ ఫ్లోటింగ్ క్రేన్లు మాత్రమే ఉన్నాయని పెంటగాన్ ధ్రువీకరించింది. సబ్‌మెరైన్ మునిగిన విషయం డ్రాగన్ దాచడంలో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొంది. దీంతో PLA సామర్థ్యంపై సందేహాలు పెరిగాయంది.