News September 27, 2024

₹10,000 కోట్లతో స్విగ్గీ IPO

image

ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ గురువారం సెబీ వద్ద IPO పేపర్లను సబ్మిట్ చేసింది. ₹10వేల కోట్ల విలువతో వస్తోంది. పేటీఎం (₹18,300 కోట్లు) తర్వాత భారత్‌లో అత్యంత విలువైన స్టార్టప్ IPO ఇదే. వచ్చే వారం షేర్‌హోల్డర్ల మీటింగ్ తర్వాత ఈ విలువను ₹11,700 కోట్లకు పెంచుతారని అంచనా. ఫ్రెష్ ఇష్యూ ద్వారా ₹3750 కోట్లు, OFS ద్వారా మిగిలిన డబ్బును సమీకరిస్తారు. స్విగ్గీ రైవల్ జొమాటో ₹9,375 కోట్లతో IPOకు వచ్చింది.

Similar News

News September 27, 2024

IPL అభిమానులకు బ్యాడ్ న్యూస్?

image

IPL-2025లో మ్యాచ్‌ల సంఖ్యను 84కు పెంచేది లేదని BCCI తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి 74 మ్యాచ్‌లే ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా వచ్చే సీజన్‌లో 84 మ్యాచ్‌లు ఆడించాలని గతంలో BCCI యోచించింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

News September 27, 2024

జగన్ తిరుపతి పర్యటన.. కూటమి కీలక నిర్ణయం

image

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుపతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిర్ణయించారు. అయితే లడ్డూ కల్తీకి కారణం జగనే అని, ఆయన వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

News September 27, 2024

చరిత్ర సృష్టించేందుకు 35 పరుగులు కావాలి!

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అరుదైన జాబితాలో చేరనున్నారు. 534 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 26,965 పరుగులు చేశారు. మరో 35 చేస్తే అత్యంత వేగంగా 27వేల రన్స్ పూర్తి చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనున్నారు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్టులో ఆయన 35 రన్స్ చేస్తే ఇది సాధ్యమవుతుంది. కాగా, సచిన్, సంగక్కర, రికీ పాటింగ్‌ మాత్రమే 27వేల పరుగులు పూర్తిచేశారు. కోహ్లీ ఈ జాబితాలో చేరతారా?