News October 29, 2024
స్విగ్గీ IPO.. రూ.371-390 మధ్య ధరల శ్రేణి

ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ IPO నవంబర్ 6 నుంచి 8 వరకు కొనసాగనుంది. ధరల శ్రేణిని రూ.371-390 మధ్య నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫర్ సేల్ ద్వారా రూ.6,800 కోట్లు, కొత్త షేర్ల జారీతో రూ.4,500 కోట్లు(మొత్తం రూ.11,300 కోట్లు) సమీకరించనుంది. ఈ ఏడాది వస్తున్న అతిపెద్ద IPOల్లో స్విగ్గీ ఒకటి. 2022 లెక్కల ప్రకారం స్విగ్గీ విలువ 10.7 బిలియన్ డాలర్లు.
Similar News
News February 19, 2026
కాపర్ టీ వాడుతున్నారా?

అవాంఛిత గర్భధారణను నివారించడానికి చాలామంది మహిళలు కాపర్ టీ వాడతారు. అయితే దీన్ని సరిగ్గా ప్లేస్ చేయకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, కొన్నిసార్లు గర్భాశయ లైనింగ్ గాయపడటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో దాన్ని తొలగించుకోవాలని సూచిస్తున్నారు.
News February 19, 2026
Coffin Homes: 16 స్క్వేర్ ఫీట్ రూమ్.. అద్దె ₹40 వేలు!

ఎత్తైన బిల్డింగులు ఉండే హాంకాంగ్‌లో పేదరికం ఊపిరి ఆడనీయడం లేదు. ఆకాశాన్నంటే అద్దెలు చెల్లించలేక సుమారు 2 లక్షల మంది ప్రజలు కేవలం 16 చ.అ ‘కఫిన్ హోమ్స్’లో బతుకులీడుస్తున్నారు. వీటికి నెలకు ₹20-40 వేల అద్దె. కనీసం కాళ్లు చాచుకోవడానికి, నిలబడడానికి కూడా వీలులేని ఈ ఇరుకు గదుల్లోనే వంట, టాయిలెట్ అన్నీ. ఒకే అంతస్తును రెండుగా మార్చి, ప్లైవుడ్‌తో విభజించి ఇలాంటి రూమ్‌లను తయారు చేస్తున్నారు.
News February 19, 2026
‘పెద్ది’ విడుదలకు ముందే ₹150 కోట్ల బిజినెస్?

రామ్ చరణ్, బుచ్చిబాబు క్రేజీ కాంబోలో వస్తున్న‘పెద్ది’ నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ₹130 కోట్లకు కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఆడియో హక్కులు మరో ₹18 కోట్లు పలికినట్లు టాక్. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులతో కలిపి రిలీజ్‌కు ముందే ₹150 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


