News October 27, 2024
Swiggy IPO: Nov 6-8 మధ్య పబ్లిక్ సబ్స్క్రిప్షన్
Swiggy IPO పబ్లిక్ సబ్స్క్రిప్షన్ నవంబర్ 6-8 తేదీల మధ్య జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. $11.3 బిలియన్ల (₹93,790 కోట్లు) IPO వాల్యుయేషన్‌ను సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. IPO ప్రైమరీ కాంపోనెంట్‌ను సుమారు ₹4,500 కోట్లకు పెంచారు. ఇన్వెస్టర్ల ఆసక్తికి అనుగుణంగా OFS కాంపోనెంట్నూ సవరించినట్లు తెలిసింది. మొత్తం IPO పరిమాణం ₹11,700 కోట్ల నుంచి ₹11,800 కోట్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నాయి.
Similar News
News January 3, 2025
ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TG: సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 24 రోజులుగా వారు విధులకు రాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించడం లేదా విద్యాశాఖలో విలీనం చేయడం న్యాయపరంగా కుదరదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
News January 3, 2025
నేటి నుంచి నుమాయిష్
TG: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నేటి నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుమాయిష్‌లో 2వేల స్టాల్స్‌ను సొసైటీ ఏర్పాటు చేయనుంది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. వీకెండ్స్‌లో మరో గంట అదనపు సమయం కేటాయించారు. ప్రవేశ రుసుము రూ.50.
News January 3, 2025
మహా కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
ఉత్తర్ ప్రదేశ్‌లో జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు 26 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వచ్చే నెల 5 నుంచి 27 వరకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి యూపీ మధ్య నడవనున్నాయి. గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ నుంచి వెళ్లే రైళ్లు వరంగల్, రామగుండం మీదుగా వెళ్లనున్నాయి.