News October 24, 2024

రెస్టారెంట్స్ ఫుడ్ క్వాలిటీ చెప్పే ‘స్విగ్గీ సీల్’

image

రెస్టారెంట్లలో పరిశుభ్రత, ఆహార ప్రమాణాలను ధ్రువీకరించేందుకుగాను స్విగ్గీ సీల్ అనే కొత్త సేవలను స్విగ్గీ తీసుకురానుంది. నాణ్యతా ప్రమాణాలు పాటించే రెస్టారెంట్లకు ఈ బ్యాడ్జ్‌ని స్విగ్గీ అందిస్తుంది. కస్టమర్ల నుంచి ఫిర్యాదులొస్తే ఆ బ్యాడ్జిని తొలగిస్తుంది. పరిశుభ్రతపై ఆడిట్ నిర్వహించేందుకు FSSAI గుర్తింపు పొందిన సంస్థలతో టై-అప్ అయినట్లు కంపెనీ తెలిపింది. NOV నాటికి 650 నగరాల్లో ఈ సేవలు తీసుకురానుంది.

Similar News

News October 24, 2024

పోలీసుల్ని మర మనుషుల్లా చూస్తున్నారు: ప్రవీణ్ కుమార్

image

TG: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా పడిపోయాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ‘పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి మర మనుషుల్లా చూస్తున్నారు. నెలలో వరుసగా 26 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు సెలవులు ఇస్తామనడం దారుణం. దీనిపై పోలీసుల కుటుంబాలు నల్గొండలో ఆందోళన చేస్తే విధుల్లో ఉన్న పోలీసుల్ని సస్పెండ్ చేశారు. పోలీసుల్లో అశాంతి నెలకొంది. అది ప్రమాదకరం’ అని అన్నారు.

News October 24, 2024

రోహిత్ రికార్డును బ్రేక్ చేసిన సికందర్

image

గాంబియాపై జరిగిన T20 మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా రికార్డు సృష్టించారు. టెస్ట్ హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ(33 బంతుల్లో) చేసిన క్రికెటర్‌గా నిలిచారు. దీంతో 35 బంతుల్లో శతకం బాదిన రోహిత్ శర్మ, మిల్లర్‌ల రికార్డును బ్రేక్ చేశాడు. ICC మెన్స్ టీ20 WC సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలియర్స్‌లో నిన్న గాంబియాపై తలపడిన జింబాబ్వే 344 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ సాధించింది.

News October 24, 2024

ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో రతన్ టాటాకు అరుదైన గౌరవం

image

స్వర్గీయ రతన్ టాటా గౌరవార్థం ఆయన పేరిట ఓ భవనాన్ని నిర్మించాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్ణయించింది. సోమర్‌విలే కాలేజీ, టాటా గ్రూప్‌ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలుకానుంది. ఇందులో ఆక్స్‌ఫర్డ్ ఇండియా సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్(OICSD)ని ఏర్పాటు చేస్తామని టాటా గ్రూప్ తెలిపింది. ప్రపంచాన్ని వేధించే సమస్యల పరిష్కారాలకు ఇక్కడ అధ్యయనం నిర్వహిస్తామని వివరించింది.