News November 13, 2024
ప్రీమియం ధరకే లిస్టైన స్విగ్గీ షేర్లు.. వెంటనే నష్టాల్లోకి
ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ షేర్లు స్టాక్మార్కెట్లలో లిస్టయ్యాయి. IPO ధర రూ.390తో పోలిస్తే NSEలో 8% ప్రీమియంతో రూ.420, BSEలో 5.64% ప్రీమియంతో రూ.412 వద్ద నమోదయ్యాయి. గతవారం వచ్చిన ఈ IPOకు 3 రెట్ల స్పందన లభించింది. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడంతో ఈ షేర్లు ప్రస్తుతం 4.38% నష్టంతో రూ.401 వద్ద ట్రేడవుతున్నాయి.
Similar News
News December 27, 2024
నా మార్గదర్శిని కోల్పోయా: రాహుల్ గాంధీ
అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు. తన గురువు, మార్గదర్శిని కోల్పోయానన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆర్థిక శాస్త్రంలో మన్మోహన్కు ఉన్న లోతైన అవగాహన దేశానికి ఓ స్ఫూర్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆయన నిజాయితీ మనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని ఎంపీ ప్రియాంకా గాంధీ చెప్పారు.
News December 27, 2024
మన్మోహన్ను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: రాష్ట్రపతి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి అందరికీ తీరని లోటు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మన్మోహన్ను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మన్మోహన్ ఇక లేరన్న విషయం బాధకు గురిచేసిందని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. దేశం ఒక మహోన్నత వ్యక్తికి కోల్పోయిందని చెప్పారు.
News December 27, 2024
మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు
మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఆయన మరణం దేశానికి తీరని లోటు. కేంద్ర ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రధానిగా దేశానికి సేవలందించారు’ అని చంద్రబాబు కొనియాడారు. ‘మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త, మానవతావాది. అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది’ అని రేవంత్ పేర్కొన్నారు.