News August 28, 2024
పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు: అంబటి

AP: ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడతారని జరుగుతున్న <<13958618>>ప్రచారంపై<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘జగన్కు మోపిదేవి సన్నిహితుడు. ఎమ్మెల్యేగా ఓడినా ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయన పార్టీని వీడతారని నేను అనుకోవట్లేదు. అధికార పార్టీలో చేరడం అంటే క్యారెక్టర్ కోల్పోవడమే. అధికారం శాశ్వతం కాదని నాయకులు గుర్తుంచుకోవాలి . పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 5, 2025
ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు: సీఎం రేవంత్

TG: హనుమాన్ గుడిలేని ఊరు ఉండొచ్చు.. కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని CM రేవంత్ అన్నారు. వరంగల్(D) నర్సంపేట సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని, తాము ఒకేసారి ₹20,614Cr మాఫీ చేశామని తెలిపారు. ‘KCR పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేం లక్షలాది మందికి ఇచ్చాం. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని చెప్పారు.
News December 5, 2025
వరి నారుమడిలో కలుపు యాజమాన్యం

వరి నారుమడిలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. దీని నివారణకు 5 సెంట్ల నారుమడిలో విత్తిన 3 నుంచి 5 రోజుల లోపు పైరజోసల్ఫ్యూరాన్-ఇథైల్ 10% W.P లేదా ప్రిటిలాక్లోర్+సేఫ్నర్ 20mlను ఒక కిలో పొడి ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అలాగే విత్తిన 15-20 రోజులకు గడ్డి, వెడల్పాకు కలుపు నివారణకు 5 సెంట్లకు 10 లీటర్ల నీటిలో బిస్పైరిబాక్ సోడియం 10% S.L 5ml కలిపి పిచికారీ చేయాలి.
News December 5, 2025
భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది: మోదీ

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని PM మోదీ తెలిపారు. ‘శాంతియుతమైన శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నాలను IND స్వాగతిస్తోంది. మా దేశం తటస్థంగా లేదు. ఎప్పుడూ శాంతివైపే నిలబడుతుంది. ఉక్రెయిన్ విషయంలోనూ అదే కోరుకుంటోంది. భారత్-రష్యా స్నేహం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయపడుతుందనే నమ్మకం ఉంది. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయి’ అని చెప్పారు.


