News September 22, 2025

వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు లక్షణాలు

image

వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు పంట నాటిన 25 నుంచి 35 రోజుల తర్వాత ఎప్పుడైనా ఆశించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గడం, ఆకులపై మంచు ఉండటం, అధిక వర్షం, అధిక నత్రజని వాడకం, మెగ్నీషియం లోపం ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతుంది. ఈ తెగులు వల్ల ఆకుల అడుగు భాగం, కాండం, ఊడలపైనా ముదురు రంగులో గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. తర్వాత దశలో ఈ మచ్చలు అన్నీ ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు పండుబారి రాలిపోతాయి.

Similar News

News September 22, 2025

రాష్ట్రంలో 42 పోస్టులు.. దరఖాస్తుల సవరణకు కొన్ని గంటలే ఛాన్స్

image

<>ఏపీలో<<>> 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తులో తప్పుగా నమోదు చేశారా? అలాంటి వారికి ముఖ్య గమనిక. తప్పుల సవరణకు ఇవాళ సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఉంది. వివరాలు తప్పుగా నమోదు చేసినవారు సవరణ చేసుకోవచ్చని పోలీస్ నియామక మండలి తెలిపింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 7వరకు దరఖాస్తులను స్వీకరించింది.

News September 22, 2025

భర్తలను కాపాడుకున్న భార్యలు!

image

భర్త ప్రాణాల్ని కాపాడుకొనేందుకు భార్య చూపే ప్రేమ, త్యాగాలకు సరిహద్దులు లేవని ఈ ఘటన మరోసారి నిరూపించింది. నవీ ముంబైలో ప్రాణాంతక వ్యాధితో ఇద్దరు భర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్ చేద్దామంటే కుటుంబీకుల రక్తం మ్యాచ్ అవ్వకపోవడంతో ఒకరి భర్త కోసం మరొకరు లివర్‌ను దానం చేసి వారి ప్రాణాలు కాపాడారు. ఆపరేషన్ విజయవంతమై నలుగురూ క్షేమంగా ఉన్నారు. భార్యల త్యాగాన్ని నెటిజన్లు ప్రశంసింస్తున్నారు.

News September 22, 2025

అందంగా.. ఆపదలో రక్షణగా!

image

పనుల కోసం బయటికెళ్లే యువతులు, మహిళల స్వీయ రక్షణ కోసం కొత్త తరహా వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. క్యాట్ ఇయర్ కీచైన్లు లేదా కిట్టి నకిల్స్ లేదా సెల్ఫ్ డిఫెన్స్ కీ చైన్ల పేరుతో ఆన్‌లైన్‌లో లభిస్తాయి. అందంగా ఉండే వీటిని కార్, స్కూటీ కీలకు, బ్యాగ్‌లు, పర్సులకు పెట్టుకోవచ్చు. అత్యవసర సమయాల్లో వీటి రంధ్రాల్లో వేళ్లని పెట్టి గ్రిప్ తెచ్చుకుని అవతలి వ్యక్తిని ప్రతిఘటించవచ్చు.
#ShareIt