News July 18, 2024
కోవిడ్ సోకిన పిల్లల్లో డయాబెటిస్ లక్షణాలు?

కోవిడ్ సోకిన చిన్నారుల్లో టైప్ 1 డయాబెటిస్ లక్షణాలు వేగంగా బయటపడతాయని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించిన ఓ స్టడీలో తేలింది. ఇది రోగ నిరోధక వ్యవస్థ, ప్యాంక్రియాస్పైనా దాడి చేసి దెబ్బ తీస్తుందని తెలిపారు. ఇలాంటి వారిలో దాహం, తరచూ మూత్రవిసర్జన, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. బ్లడ్ టెస్ట్తో దీనిని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని తెలిపింది.
Similar News
News November 5, 2025
133 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<
News November 5, 2025
7 బిలియన్ ఏళ్ల కిందట విశ్వం టెంపరేచర్ ఎంత?

‘బిగ్ బ్యాంగ్’ ప్రకారం 13.8బిలియన్ ఏళ్ల కిందట ఏర్పడిన విశ్వంలో ఎన్నో అద్భుతాలు, రహస్యాలున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని జపాన్ సైంటిస్టులు కనుగొన్నారు. ఈ యూనివర్స్ టెంపరేచర్ ప్రస్తుతం 2.7K(కెల్విన్) ఉండగా, 7B ఏళ్ల కిందట 5.13 కెల్విన్(−268°C) ఉండేదని తేల్చారు. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ పరిశీలనలు.. విశ్వం క్రమంగా చల్లబడుతోందనే అంచనాలను ధ్రువీకరిస్తున్నాయి.
* సెల్సియస్= కెల్విన్-273.15
News November 5, 2025
భరణి నక్షత్రంలో కార్తిక పౌర్ణమి విశిష్టత

సాధారణంగా కార్తిక పౌర్ణమి కృత్తిక నక్షత్రంతో శ్రేష్ఠమైనది. కానీ ఈ ఏడాది భరణి నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చింది. దీనికి ప్రత్యేక స్థానం ఉందని పండితులు చెబుతున్నారు. ‘ఈ పౌర్ణమి+భరణి కలయిక పాపాలను పోగొట్టి, మోక్షాన్ని, పితృదేవతల ప్రసాదాన్ని ఇస్తుంది. నేడు చేసే దీపదానం, పితృతర్పణం, గంగాస్నానం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. కృత్తిక జ్ఞాన ప్రకాశాన్నిస్తే భరణి పాప నాశనం చేస్తుంది’ అంటున్నారు.


